Yamaha R15M launch: యమహా మోటార్ ఇండియా కొన్ని మార్పులతో భారత మార్కెట్లో తన పాపులర్, ఇన్-డిమాండ్ బైక్ R15 ను లాంచ్ చేసింది.ఇందులో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ తో పాటు కొత్త ఫీచర్లు ఉన్నాయి. మెటాలిక్ గ్రేలోని యమహా ఆర్ 15ఎమ్ ధర రూ. రూ. 1,98,300గా ఉంది. కార్బన్ వెర్షన్ ధర రూ. 2,08,300గా ఉంది. ఈ రెండు ధరలు కూడా ఎక్స్ షోరూమ్. ఈ బైక్‌కు కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. ఇప్పుడు మీరు ఈ బైక్‌లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్‌ను పొందుతారు. ఇది రైడింగ్‌ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంతేకాదు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటిని Y-కనెక్ట్ యాప్ ద్వారా ఉపయోగించవచ్చు.
ఇది కాకుండా, బైక్‌కు కొత్త, అప్‌గ్రేడ్ చేసిన స్విచ్ గేర్, కొత్త LED లైసెన్స్ ప్లేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ.. ఈ బైక్ పనితీరుకు పేరుగాంచిందని, ఇప్పుడు దీన్ని మరికొంత అప్‌డేట్ చేశామన్నారు.ఈ బైక్‌లో 155 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7,500rpm వద్ద 14.2 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది కాకుండా, గరిష్టంగా 13.5 kW శక్తి 10000 rpm వద్ద ఉత్పత్తి అవుతుంది. ఈ బైక్ భారతీయ ఆటో మార్కెట్లో చాలా శక్తివంతమైన, అత్యంత ప్రజాధరన పొందుతుందని కంపెనీ ఆశిస్తుంది. ఇక ధర గురించి మాట్లాడుకుంటే, ఈ తాజా కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ వేరియంట్ ధర రూ. 2,08,300 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌ను యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మెటాలిక్ గ్రే కలర్‌లో అప్‌గ్రేడ్ చేసిన R15M ఎక్స్-షోరూమ్ ధర రూ.1,98,300.
ఇందులో ట్రాక్షన్ కంట్రోలో సిస్టమ్ సపోర్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది. ఇది పూర్తిగా డిజిటల్ కలర్ టీఎఫ్టీ స్క్రీన్ , బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అద్భుతమైన ఫినిషింగ్ తో లేటెస్ట్ వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ మోడల్ ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, బ్యాక్ సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తోపాటు ఆర్15ఎమ్ లో ఆల్ బ్లాక్ ఫెండర్, ట్యాంక్ సైడ్ ఫెయిరింగ్ కొత్త డీకాల్స్ అలాగే డ్యూయల్ బ్లూ కలర్ వీల్స్ ఉన్నాయి. ఇవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.