YouTube Music: మ్యూజిక్ లవర్స్ కు గూగుల్(Googles) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం ఫెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్(YouTube Music)ను ఇకపై ఉచితంగా అందించాలని గూగుల్ నిర్ణయించింది.
నచ్చిన పాటలు వినడం కోసం ఎక్కువ మంది ఉపయోగించేది యూట్యూబ్(YouTube). అయితే ఈ యాప్ ప్రధానంగా వీడియో ఆధారితమైనది కావడంతో కచ్చితంగా వీడియోను చూడాల్సి వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రైయిన్ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్ సంస్థ యూట్యూబ్ మ్యూజిన్‌కి అందుబాటులోకి తెచ్చింది.
Music lovers rejoice!🎵 Background listening is coming to the @YouTubeMusic app, and 🇨🇦 will be the first to enjoy this new feature starting Nov 3! Get radio-like listening with your screen off and don’t stop the music! 🎶🎶🎶 https://t.co/GPwRMcVhp1
— Google Canada (@googlecanada) October 4, 2021
Also Read: WhatsApp, facebook and instagram: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ డౌన్
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో స్క్రీన్‌ను ఆఫ్ చేసి పాటలు వినొచ్చు ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా పెయిడ్ సర్వీస్(Paid Service)గా అందుబాటులో ఉంది. దీంతో చాలా మందికి ఆ యాప్ చేరువ కాలేకపోయింది. అయితే తాజాగా ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. ఎటువంటి రుసుము చెల్లించకుండానే సంగీతాన్ని(Music) ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది.
ముందు అక్కడే ప్రారంభం
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. మొదట కెనడా(Canada)లో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స వస్తాయని తెలిపింది. యాడ్స వద్దనుకున్నవారు పెయిడ్ సర్వీసును ఎంచుకొచ్చని సూచించింది.
ఇండియా(India)లో కొన్ని హై ఎండ్‌మొబైల్ ఫోన్లలో బండిల్ ఆఫర్‌గా యూట్యూబ్ మ్యూజిక్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితం(Free)గా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతాన్ని ఎంజాయ్ చేయోచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook