Zydus Lifesciences : స్టాక్ మార్కెట్లో పలు సెక్టార్లు ఉంటాయి. ఆయా సెక్టార్ల ఆధారంగానే షేర్లు కదలాడుతుంటాయి. ముఖ్యంగా ఫార్మా సెక్టార్ కు సంబంధించిన అంతవరకు కొన్ని ఎంపిక చేసుకున్న స్టాక్స్ చక్కటి రిటర్న్స్ అందిస్తున్నాయి. ఫార్మర్ స్టాక్స్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంటాయి. ఏ కంపెనీ ఎగుమతులు పెరిగితే ఆ కంపెనీ స్టాక్స్ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఎగుమతిలన్నీ కూడా పశ్చిమ దేశాలు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా ఔషధాలు సప్లై అవుతూ ఉంటాయి.
కాగా ఆయా దేశాలకు మందులను సప్లై చేసే ముందు మనదేశంలో తయారీ యూనిట్ ఉన్నప్పటికీ USFDA అనే అమెరికా సంస్థ భద్రత నాణ్యతా ప్రమాణాలను పాటించే ఔషధ కంపెనీలకు మాత్రమే ఎగుమతి చేసేందుకు అనుమతి లభిస్తుంది. ఎవరికైతే ఈ సంస్థ నుంచి అనుమతి లభించదో వారికి సంబంధించిన స్టాక్ విలువలు మార్కెట్లో పతనం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఒక ఫార్మా కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ షేర్లు గడచిన రెండు సంవత్సరాలు వ్యవధిలో 215 శాతం లాభాలను అందించాయి.
Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!
ప్రస్తుతం Zydus Lifesciences షేరు గురించి ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ అనిల్ సింఘ్వి ఎనాలిసిస్ తెలుసుకుందాం. మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ Zydus Lifesciences షేర్లను గత నెల కొనుగోలు చేయాలని పెట్టుబడిదారులకు సూచించగా, ఆయన పేర్కొన్న టార్గెట్ 1200 రూపాయలు కేవలం నెల రోజుల్లోనే తాకింది. Zydus Lifesciences షేర్ ధర ప్రస్తుతం రూ. 1,253 వద్ద ఉంది. ఈ స్టాక్ గత ఏడాది ఆగస్టు నెలలో 650 రూపాయల వద్ద ఉంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 95 శాతం పెరిగింది. అంతేకాదు గత 5 ఏళ్ల కాలంలో ఈ స్టాక్ తన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు 475 శాతం రిటర్న్ అందించగా. ఇక ఈ స్టాక్ 2000 సంవత్సరం ఏప్రిల్ 18 తేదీన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు దీని విలువ కేవలం 7 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ఏకంగా 1253 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు 15,601 శాతం ఈ స్టాక్ పెరిగింది.
Zydus Lifesciences Q1 ఫలితాలు బలంగా ఉన్నాయి :
Zydus Lifesciences క్యూ1లో బలమైన ఫలితాలు సాధిస్తుందని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వి తెలిపారు. ఫార్మా రంగంలోని కంపెనీల సగటు ఆదాయ వృద్ధి 10 శాతంగా అంచనా వేయగా, జైడస్ లైఫ్‌సైన్సెస్ ఆదాయ వృద్ధి కేవలం రెండింతలు అంటే 20 శాతంగా ఉంటుందని అంచనా. మొత్తం మీద ఫార్మా రంగంలోని కంపెనీల లాభం 18 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా. అదే సమయంలో, జైడస్ లాభాల వృద్ధి 25 శాతంగా అంచనా వేశారు.
BP-తగ్గించే ఔషధానికి USFDA నుండి Zydus Lifesciences తాత్కాలిక ఆమోదం పొందింది :
అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే జెనరిక్ అజిల్‌సార్టన్ మెడోక్సోమిల్ టాబ్లెట్‌లను మార్కెట్ చేయడానికి యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుండి తాత్కాలిక అనుమతి పొందినట్లు జైడస్ లైఫ్‌సైన్సెస్ తెలిపింది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) తాత్కాలిక ఆమోదం 40 mg, 80 mg బలాలు కలిగిన Azilsartan Medoxomil మాత్రలకు, Zydus Lifesciences రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఔషధాన్ని అహ్మదాబాద్ సెజ్ - IIలోని గ్రూప్ ఫార్ములేషన్ తయారీ కేంద్రం వద్ద తయారు చేయనున్నట్లు తెలిపింది.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook