Shocking News, Weird News : కుక్కని కుక్క అని పిలిచాడనే ఆగ్రహంతో 62 ఏళ్ల వృద్ధుడుని అతడి పొరుగు ఇంటి వ్యక్తే కొట్టిచంపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దిండిగల్ జిల్లాలో తడికొంబు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉలగంపట్టియార్‌కొట్టం ప్రాంతంలో నివాసం ఉంటున్న రాయప్పన్ అనే వృద్ధుడికి, అతడి పొరుగింట్లో నివాసం ఉంటున్న నిర్మలా ఫాతిమా రాణి ఇద్దరు కుమారులైన డానియెల్, విన్సెంట్ కి మధ్య తరచుగా ఓ వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఏంటంటే.. డానియెల్, విన్సెంట్ ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే, రాయప్పన్ తమ పెంపుడు కుక్కను కుక్క అని సంభోదిస్తున్నాడని.. అలా పిలవొద్దని గతంలోనే హెచ్చరించారు.
ఇదిలావుండగా.. గురువారం రాయప్పన్ తన మనవడిని పిలిచి తమ వ్యవసాయ బావి వద్ద పంప్ మోటార్ ఆఫ్ చేసి రావాల్సిందిగా సూచించాడు. వెళ్లే దారిలో కుక్క ఉంటుందని.. ముందు జాగ్రత్త కోసం తన వెంట ఓ కర్ర తీసుకెళ్లమని రాయప్పన్ తన మనవడికి సూచించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న డానియెల్ ఆ మాట వినడంతోనే కోపోద్రిక్తుడయ్యాడు. అదే ఆగ్రహంతో రాయప్పన్ దగ్గరికి వెళ్లి తన పెంపుడు కుక్కను మళ్లీ కుక్క అని పిలుస్తావా అంటూ అతడి ఛాతిపై బలంగా గుద్దాడు. డానియెల్ బలంగా కొట్టడంతో రాయప్పన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాయప్పన్ స్పాట్ డెత్ అయ్యాడని తెలుసుకున్న డానియెల్ కుటుంబం.. గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో ఊరు వదిలి పారిపోయారు.
రాయప్పన్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో డానియెల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వృద్ధుడిని కొట్టి చంపిన డానియెల్ కోసం దిండిగల్ జిల్లా పోలీసులు వేటమొదలుపెట్టారు. ఈ క్రమంలోనే విశ్వసనీయమైన సమాచారంతో శుక్రవారం నిర్మలా ఫాతిమా రాణితో పాటు డానియెల్, విన్సెంట్‌లని అదుపులోకి తీసుకున్నారు. పెంపుడు జంతువులుపై ప్రేమ ఉండటం మంచిదే కానీ వాటిపై ప్రేమను చాటుకోవడం కోసం సాటి మనిషిని కొట్టి చంపేంత కృూరత్వం ఉంటే అది మానవత్వం అనిపించుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేందుకు ఈ ఘటన కారణమైంది.
ఇది కూడా చదవండి : Powdered Human Bones: పిల్లలు పుట్టడం లేదని మనిషి ఎముకల పౌడర్ కలిపిన నీళ్లు తాగించారు
ఇది కూడా చదవండి : Man Dragged on Car Bonnet: కారు బ్యానెట్‌పై యువకుడిని కిలో మీటర్ ఈడ్చుకెళ్లిన యువతి
ఇది కూడా చదవండి : Cell Phone Tower Theft: సినీ ఫక్కీలో ఇంటి మీదున్న సెల్ ఫోన్ టవర్ చోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook