Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి

Road Accident in Tamil Nadu: తమిళనాడులో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం తిగిరి కారులో వస్తుండగా.. తమిళనాడులోని తేని జిల్లాలో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 09:57 PM IST
Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి

Road Accident in Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుంచి తిరిగి వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మృతులను ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివరాలు ఇలా..

ములుగు జిల్లా నుంచి ఈ నెల 14వ తేదీ అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం కారులో తిరుగుపయణమయ్యారు. కారు తమిళనాడులోని తేనీ జిల్లా దేవదానపట్టి బైపాస్‌ రోడ్డు మీదుగా వస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన సుబ్బయ్య (55), నరసాంబయ్య (55), రాజు (55) అక్కడిక్కడే మృతి చెందారు. రాము (30), అజయ్ (25) తీవ్రగాయాలతో తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దేవదానపట్టి పోలీసులు క్షతగాత్రులను రక్షించారు. కారు ప్రమాదంపై దేవదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కమలాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News