HBD Rana Daggubati రానా దగ్గుబాటి బర్త్ డే (డిసెంబర్ 14) సందర్భంగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీల విషెస్ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, రానాలు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే రానాకు రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశాడు. అలానే మంచు లక్ష్మీ కూడా విషెస్ చెప్పేసింది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా భార్య చెప్పే విషెస్ ప్రత్యేకంగానే ఉంటాయి. ఇక రానా భార్య మిహిక చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దానిపై వెంకీ మామ కూతురు ఆశ్రిత చేసిన కామెంట్, పెట్టిన ఎమోజీలు మరింతగా వైరల్ అవుతున్నాయి.
క్యూట్ బేబీ నుంచి.. మోస్ట్ గుడ్ లుకింగ్‌గా మారిన రానాకు హ్యాపీ బర్త్ డే.. చూడండి అతను ఎంత అందంగా ఉన్నాడో.. నా జీవితంలోకి నువ్ తీసుకొచ్చిన ఈ ఆనందాలు, సంతోషాలకు థాంక్స్. భర్తలా కనిపిస్తావ్ కానీ నువ్ నాకు ఓ మంచి స్నేహితుడిలాంటి వాడివి.. నీ వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది.. ఇంత కంటే మంచి లైఫ్ నాకు దొరకదు.. ఐ లవ్యూ బేబీ.. నా ప్రేమకు హద్దుల్లేవని నీకు కూడా తెలుసు.. అందుకే నువ్ నాతోనే ఉండాల్సిందే.. అది తప్పదు.. నువ్ కోరుకున్నది, కలలు కన్నవి అన్నీ కూడా నెరవేరాలి అంటూ రానా చిన్నతనం నాటి ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్పింది మిహికా.
ఇక మిహిక వేసిన పోస్ట్ మీద ఆశ్రిత స్పందించింది. హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ.. బర్త్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి రానా బర్త్ డే సందర్భంగా వెంకీ, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లోకి రాబోతోన్న సంగతి తెలిసిందే.
Also Read : Nikhi Sidharth Remuneration : రెమ్యూనరేషన్ పెంచిన నిఖిల్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
Also Read : waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook