Dahanam Movie Review 90, 80వ దశకాలను ఇప్పుడు తెరపై చూపించడం ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసిందే. దహనం సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో గౌరవం, అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలోనూ అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాను నేడు థియేటర్లోకి వచ్చింది. దహనం కథ ఎలా సాగింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
దహనం కథ 80వ దశకంలో జరుగుతుంది. విశాఖ జిల్లాలోని వాడరేపు పల్లి గ్రామంలో జరుగుతుంది. ముఖ్యంగా పురాతన శివాలయం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఊరి కాటి కాపరి భైరాగి (ఎఫ్ఎం బాబాయ్), శివాలయం పూజారి భరద్వాజ శాస్త్రి (ఆదిత్య ఓం), ఊరి పెద్ద భూపతి పాత్రల చుట్టే ఈ కథ తిరుగుతుంది. గుడిని, గుడి మాన్యం భూములను లాక్కోవాలని భూపతి, వాటిని ఎలాగైనా కాపాడుకోవాలని భరద్వాజ శాస్త్రి చేసే ప్రయత్నమే దహనం. అయితే ఈ కథలో భైరాగి పాత్ర ఏంటి? ఆయన చేసిన త్యాగం ఏంటి? చివరకు గుడి ఏమైంది? అన్నదే దహనం.
నటీనటులు
దహనం కథలో అందరూ అద్భుతంగా నటించారు. అయితే ఇంత వరకు లవర్ బాయ్‌గా, రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన ఆదిత్య.. మొదటి సారి ఇలాంటి ఓ అద్భుతమైన పాత్రను పోషించాడు. భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఒదిగిపోయాడు. ఆయన వాచకం, కట్టూబొట్టూ, నడవడికి అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఇక ఈ సినిమాలో ఆదిత్య తరువాత ఎఫ్‌ఎం బాబాయ్ కనిపిస్తాడు. మెప్పిస్తాడు. చివరకు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు గుర్తుకు వస్తాడు. భూపతి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. వైదేహి, అనసూయ, సాంబడు ఇలా అన్ని పాత్రలు కదిలిస్తాయి. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ
కుల వివక్ష, వర్ణ వివక్ష అనేది మనం చూస్తూనే ఉంటాం. కుల వివక్ష, అంటరానితనం వలదు అంటూ ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులోనూ కులాల ప్రస్థావన చూపించారు. అయితే ఈ కథనానికి శివాలయం అనే కేంద్ర బిందువుని పెట్టడంతో కాస్త ఇంట్రెస్ట్‌గా మారింది. బ్రాహ్మణ, దళిత వర్గాల సమస్యలను దహనం చూపించింది.
నీతి నిజాయితీగా బతికే ఓ పూజారికి తినడానికి తిండి కూడా ఉండదు. శవాలను నమ్ముకుని బతికే కాటి కాపరి ఇంట రుచికరమైన భోజనం ఉంటుంది. పసిబిడ్డ ఆకలిని తీర్చేందుకు పాలు కూడా ఉండవు. కానీ భక్తులు తెచ్చే పాలను శివలింగంపై పోస్తూ ఉన్న సీన్ అందరినీ కదిలిస్తుంది. ఇక శివుడి గురించి, కులాల గురించి, అంటరానితనం గురించి, ఆకలికి ఆచారం ఉంటుందా? అంటూ చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి.
పాటలు సందర్భానుసారంగా వస్తాయి. సంగీతం, సాహిత్యం పర్వాలేదనిపిస్తాయి. సినిమా ఆసాంతం నెమ్మదిగా సాగుతుండటమే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
రేటింగ్ 2.5
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook