Pattudala Trailer: తమిళ టాప్ స్టార్ అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో మగిళ్ తిరుమేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విడాముయర్చి’.తెలుగులో ‘పట్టుదల’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో మేకర్స్ ‘పట్టుదల’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికొస్తే..అజిత్ పట్టుదల ఉన్న వ్యక్తి పాత్రలో నటిస్తున్నట్టు టైటిల్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేపర్ లుక్‌తో నెవర్ బిఫోర్ అవతార్‌లో మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ట్రైలర్‌లో తన వాళ్ల కోసం అజిత్ విలన్స్‌తో చేస్తున్న పోరాటాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఈ సినిమాలో మరోసారి అజిత్ సరసన త్రిష నటించింది. వీరిద్దరి మధ్య క్యూట్ కెమిస్ట్రీ అదిరింది. అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘మంగత్తా’, గ్యాంబ్లర్ సినిమా తర్వాత అర్జున్, అజిత్ మరోసారి కలిసి నటించారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు నటించారు.
Hold tight! 💥 The PATTUDALA Trailer is releasing today at 6:40 PM ⏰ only on @GeminiTV Youtube channel. Efforts Never Fail! 💪#Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/v950tsCW8h
— Beyond Media (@beyondmediapres) January 16, 2025
ఓంప్రకాష్ అందించిన విజువల్స్ సినిమా లుక్‌ను పూర్తిగా మార్చేయటమే కాదు. బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడబోతున్న ప్రేక్షకులకు పట్టుదల సినిమా ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో, బీజీఎంతో కట్టి పడేసారు. ఇప్పటి వరకు పట్టుదల సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో పీక్స్‌కు చేరాయి.
ఎన్.బి.శ్రీకాంత్ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను అందించారు. అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వర్క్ చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేశారు. జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న పబ్లిసిటీ డిజైనర్ వర్క్ చేశారు. హరిహరసుతన్ గ్రాఫిక్స్ అందించారు. అజిత్ కుమార్ ‘పట్టుదల’ (విడాముయర్చి) సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ఆడియో హక్కులను కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.