Pushpa: The Rule: పని మొదలెట్టిన అల్లు అర్జున్.. ఆ ఫోటో షేర్ చేయడంతో మేటర్ లీక్!

Allu Arjun  shoot for 'Pushpa: The Rule': చాలా కాలం నుంచి అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది, ఈమేరకు ఒక ఫోటో వైరల్ అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 30, 2022, 05:58 PM IST
Pushpa: The Rule: పని మొదలెట్టిన అల్లు అర్జున్.. ఆ ఫోటో షేర్ చేయడంతో మేటర్ లీక్!

Allu Arjun begins shooting for 'Pushpa: The Rule': పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక వందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన పుష్ప పార్ట్ 1 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ రెండవ భాగం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు.

ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది, ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ కుబా బ్రోజెక్ అల్లు అర్జున్తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేయడమే కాక సినిమా షూటింగ్ మొదలైంది అని హింట్ ఇచ్చే విధంగా "సాహసం ప్రారంభమైంది అంటూ ఒక కామెంట్ చేశారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాసిల్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక రెండో భాగంలో విజయ్ సేతుపతి లాంటి వారిని కూడా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది కానీ ఆ విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లభించలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ వ్యవహారం మీద మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమాటోగ్రాఫర్ ఫోటో షేర్ చేయడంతో దాదాపు షూటింగ్ కూడా ప్రారంభమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.  

అయితే ఇది లుక్ టెస్ట్ కోసం చేస్తున్నారా లేక నిజంగానే షూటింగ్ ప్రారంభమైందా అనే విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో క్లారిటీ రాదనే చెప్పాలి, మొత్తం మీద సుకుమార్ చేయబోతున్న పుష్ప ది రూల్ సినిమా మీద భారీ అంచనాలైతే నెలకొని ఉన్నాయి చూడాలి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోతుంది అనేది.

Also Read: Vijay Devarakonda tension: సమంత దెబ్బకు టెన్షన్ విజయ్ దేవరకొండ?

Also Read: Actress Vinaya Prasad: ప్రముఖ నటి ఇంట చోరీ.. దీపావళికి వెళ్లి వచ్చేలోపు ఇల్లంతా ఊడ్చేశారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News