Pushpa OTT release date: అతి త్వరలో ఓటీటీలో పుష్ప మూవీ స్ట్రీమింగ్.. ఏ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే!

Pushpa Movie OTT releasing date: అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కరోనా కారణంగా మళ్లీ థియేటర్లు మూతపడుతుండటంతో పుష్ప మూవీని ఓటిటిపై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 05:06 PM IST
  • పుష్ప‌‌.. ది రైజ్‌ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్
  • జనవరి 7వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్
  • పుష్ప తెలుగు వెర్షన్‌ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కానుందని టాక్
Pushpa OTT release date: అతి త్వరలో ఓటీటీలో పుష్ప మూవీ స్ట్రీమింగ్.. ఏ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే!

Pushpa Movie releasing on OTT, read when and where to watch : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప‌‌ ది రైజ్‌ (Pushpa The Rise) టైటిల్‌తో డిసెంబర్‌‌ 17న రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. బన్నీ (Bunny) అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే మూవీ ఉండడంతో పుష్ప రాజ్ (Pushpa Raj) హిట్ అందుకున్నాడు. 

అల్లు అర్జున్ (Allu Arjun) ఫస్ట్ టైమ్ డీ గ్లామరస్‌ క్యారెక్టర్‌‌లో యాక్టింగ్ ఇరగదీశాడు. మాస్ పాత్రకు న్యాయం చేశాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది పుష్ప మూవీ. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే 300 కోట్ల రూపాయల ట్రేడ్‌ మార్క్‌ దాటేసింది.

ఇక పుష్ప మూవీతో బాలీవుడ్‌లోకి (Bollywood‌) కూడా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బాలీవుడ్‌లో రిలీజైన 83 మూవీ కంటే పుష్ప మూవీనే కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందట. రష్మిక (Rashmika Mandanna) కూడా ఈ మూవీతో తన స్టార్‌‌డమ్‌ను మరింత పెంచుకుంది. డీ గ్లామరస్ పాత్రలో అదరగొట్టేసింది ఈ నేషనల్ క్రష్. సినిమాలోని ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ మూవీని తెరకెక్కించారు సుకుమార్.

Also Read : Delhi Weekend Curfew: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News