Allu Arjun - Trivikram: అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. అంతేకాదు ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి పోటీగా హిందీలో సింగం 3 మూవీ విడుదల కాబోతుంది.
ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ ..సుకుమార్‌తో చేస్తోన్న 'పుష్ప 2' మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్టు ఎపుడో ప్రకటించారు. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారు. రీసెంట్‌గా గురూజీ మహేష్ బాబుతో చేసిన 'గుంటురు కారం' సినిమాతో చేదు ఫలితాన్ని అందుకున్నాడు. స్టార్ హీరోతో స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించినా.. వీరి ఇమేజ్‌కు అది తక్కువే అని అందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు అదిరిపోయినా.. ప్రేక్షకులు ఎందుకో ఈ సినిమాను తిరస్కరించారు. తల్లితో కుమారుడికి సంబంధం లేదంటూ కుమారుడు ఓ బ్యాండ్ పేపర్ రాసివ్వడమనే పాయింట్ చుట్టే ఈ సినిమా కథ నడిపించాడు త్రివిక్రమ్.
ఆ సంగతి పక్కన పెడితే.. ఇపుడు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి కథ విషయంలో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఈ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా ఈ యేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించి .. వచ్చే యేడాది సమ్మర్‌కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక గతంలో వీళ్లిద్దరి కలయికలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమలు మంచి విజయాలే సాధించాయి. అల వైకుంఠపురములో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు రాబోతున్న నాల్గో చిత్రాన్ని హరికా అండ్ హాసినీ క్రియేషన్స్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలున్నాయి.
అటు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగాలతో పాటు, సురేందర్ రెడ్డితో రేసుగుర్రం 2 మూవీలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook