‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’.. సుడిగాలి సుదీర్ బాటలో యాంకర్ ప్రదీప్

30 Rojullo Preminchatam Ela | యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి తన్ లక్ పరీక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నాడు. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటిస్తున్నాడు.

Last Updated : Jan 26, 2020, 09:01 AM IST
‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’.. సుడిగాలి సుదీర్ బాటలో యాంకర్ ప్రదీప్

బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. జబర్ధస్త్ ‘సుడిగాలి’ సుదీర్ బాటలో నడుస్తున్నాడు. బుల్లితెర మీద సక్సెస్ అయిన సుదీర్ మొదట చిన్న చిన్న వేషాలు వేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ యాంకర్‌గా రాణిస్తునూ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించేవాడు. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకునే ప్రదీప్.. హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రదీప్ హీరోగా నటిస్తోన్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా దర్శకుడిగా మారి చేస్తున్న ప్రయత్నమిది. బుల్లితెర నుంచి వెండితెరకు నటీనటులు రావడం ఇదేమీ కొత్త కాదు. తాజాగా ఇదే కోవలోకి ప్రదీప్ చేరబోతున్నాడు. మున్నా కథ కూడా తానే రాయడం విశేషం. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మూవీ యూనిట్‌కు రానా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రదీప్ గ్రామీణ యువకుడిగా కనిపిస్తున్నాడు. 

అమృత అయ్యర్‌ లుక్ కూడా ఈ తొలి పోస్టర్‌తోనే రివీల్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాలు ఉంది. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. చంద్రబోస్ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే మూవీ యూనిట్ ప్రకటించనుంది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News