Ravi Teja: అన్నయ్య అని పిలుస్తావా.. అనుపమపై రవితేజ అసహనం.. సపోర్ట్ చేసిన మిగతా హీరోలు

Anupama Parameswaran: ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఈమధ్య కొన్ని ఫన్నీ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్ అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 12:05 PM IST
Ravi Teja: అన్నయ్య అని పిలుస్తావా.. అనుపమపై రవితేజ అసహనం.. సపోర్ట్ చేసిన మిగతా హీరోలు

Eagle: ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాల పోటీలో నిలవాల్సిన సినిమా రవితేజ ఈగల్. అయితే ఆల్రెడీ నాగార్జున నా సామిరంగా, మహేష్ బాబు గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సినిమాలు.. థియేటర్స్ సొంతం చేసుకోగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాట విని ఈగల్ మేకర్స్ వెనక్కి తగ్గారు. సంక్రాంతి నుంచి తప్పుకుంటే ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తాము అంటూ ప్రకటించారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక ఇప్పుడు అదే ఫాలో అవుతూ ఫైనల్ గా ప్రస్తుతం ఫిబ్రవరి 9న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, సినిమా ప్రమోషన్స్ లో ఆక్టివ్ గా పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. వరుస ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఓ చిన్న క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ వర్మ తదితరులు పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది. అప్పుడు రవితేజ వెంటనే.. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా అంటూ ఓ హర్ట్ అయినా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. బేసిగ్గా అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు..నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అనేది నువ్వు అర్ధం చేసుకో అని అన్నాడు. వెంటనే నవదీప్ నువ్వు అన్నయ్య అన్న ప్రతిసారి ఆదర్శకుడు ఎంత బాధపడుతున్నారో అనగా.. రవితేజ ఆ విషయాన్ని దర్శకుని అడుగుదాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

 

అయితే అనుపమ.. నేను అతనితో కలిసి నాలుగో సినిమా చేస్తున్నాను. మా మధ్య ర్యాపో ఉండి అలా పిలుస్తున్నాను అంది. అయినా కానీ రవితేజ ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా కార్తీక్ అని పిలిచి మళ్లీ నా వల్ల కాలేదు ఇది నాలుగో సినిమా కదా అంతే చెప్పుకొచ్చింది.. వెంటనే పక్కనే ఉన్న శ్రీనివాసా అవసరాల అందుకుంటూ అయితే మేము మూడు సినిమాలు మీతో చేసి ఆపేస్తాం అని కౌంటర్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఇలా చాలా సరదాగా సాగింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలోని ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also read: RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు

Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News