Akhanda 2: నందమూరి బాలకృష్ణ ఇటీవల వరుసగా హిట్లు కొడుతూ తన అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం డాకు మహారాజ్ మొదటి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విజయం బాలకృష్ణ కెరీర్‌లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. ఇక, ఈ చిత్ర విజయంలో..సంగీత దర్శకుడిగా తమన్ కీలక పాత్ర పోషించారు అని అంటున్నాడు అందరూ. అందుకు కారణం లేకపోలేదు. బాలకృష్ణ సినిమా అంటే చాలు తమ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇక ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలవగా.. ఆ క్రెడిట్ మొత్తం తమన్ కి దక్కింది.
బాలకృష్ణ, తమన్ కలిసి పని చేయడం అంటే ఫ్యాన్స్ కు పెద్ద గిఫ్ట్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా హిట్లు సాధించాయి. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి మూడు బ్లాక్ బస్టర్లతో వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టింది. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మరోసారి ఈ అద్భుత కాంబోలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది.
బాలకృష్ణ, తమన్ కాంబో చిత్రాలు విడుదల.. అయితే థియేటర్ యాజమాన్యాలు కూడా వదలిపోతున్నాడు. థియేటర్స్ లో.. సౌండ్ అండ్ మ్యూజిక్ వినిపించినప్పుడు బాక్సులు బద్దలు అవుతాయేమో అన్నట్టు ఈ మ్యూజిక్ ఉంటుందని చెబుతున్నారు. దీన్ని బట్టి వీరిద్దరి కాంబినేషన్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ వీరి కాంబినేషన్ సినిమా అంటే.. బ్రహ్మరథం పడుతున్నారు.
డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో తమన్ చెప్పిన బక్కోడికి రజిని, బండోడికి బాలయ్య అన్న డైలాగ్ ఎంతగానో వైరల్ అయింది. ఇక ఎందుకు తగ్గట్టుగానే నిజంగానే బాలకృష్ణ కి ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నారు తమన్.
ప్రస్తుతం బాలకృష్ణ తన 2.0 వెర్షన్ లో మళ్ళీ సూపర్‌గా రాణిస్తున్నారు. అసలు తనంటే ఏమిటో ఇంకా ముందు ముందు చూస్తారు అని బాలకృష్ణ సైతం ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఎనర్జీకి తమన్ ఎనర్జీ తోడై సినీ ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. వీరి కాంబోలో అఖండ 2 త్వరలో విడుదల అవుతున్నది. ఈ చిత్రం పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మహా కుంభమేళా లో ఈ చిత్రం యొక్క షూటింగ్ బోయపాటి శ్రీను భారీగా ప్లాన్ చేశారు.
అఖండ 2 తో తమన్ మరోసారి తన సంగీతంతో బాక్సులు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు అని వెనుకరి. ఇక ఈ కాంబోకి మరిన్ని విజయాలు ఖాయం అని అంచనా వేయడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: ఈ 7 ఫుడ్స్ మీకు ప్రమాదకరం.. సైలెంట్‌గా మిమ్మల్ని క్యాన్సర్ రోగిగా మారుస్తాయి..
Read Also: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.