Siddhanth Kapoor: బెంగళూరు డ్రగ్స్ కేసు.. బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్

Siddhanth Kapoor in Drugs Case: బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించి పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కపూర్‌కు బెయిల్ లభించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 07:10 AM IST
  • బెంగళూరు డ్రగ్స్ కేసులో సిద్ధాంత్ కపూర్ అరెస్ట్
  • ఓ పార్టీలో డ్రగ్స్ సేవించిన సిద్ధాంత్ కపూర్
  • పోలీసుల దాడుల్లో పట్టుబడిన నటుడు
  • స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదల
Siddhanth Kapoor: బెంగళూరు డ్రగ్స్ కేసు.. బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్

Siddhanth Kapoor in Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు, స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనితో పాటు అరెస్టయిన మరో నలుగురు కూడా బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఐదుగురు.. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఈస్ట్ బెంగళూరు డీసీపీ భీమా శంకర్ తెలిపారు. 

మెడికల్ టెస్టుల్లో సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని భీమా శంకర్ వెల్లడించారు.ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని చెప్పారు. సిద్దాంత్ కపూర్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తామన్నారు.

ఆదివారం రాత్రి ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడ దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ సమయంలో ఎవరి వద్ద డ్రగ్స్ పట్టుబడలేదని.. అయితే సమీపంలో ఎండీఎంఏ, గంజాయి పడేసి ఉన్నాయని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. వాటిని పడేసింది ఎవరనేది తెలుస్తుందన్నారు.

డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానించినవారందరి శాంపిల్స్‌ను మెడికల్ టెస్టుల కోసం పంపించామన్నారు. ఇందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడి కాగా.. వీరిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకునే పార్టీకి వచ్చారా లేక పార్టీకి వచ్చాక డ్రగ్స్ తీసుకున్నారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆ హోటల్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేకుండా పోయిందన్నారు. బెంగళూరు పోలీసులు ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని.. డ్రగ్స్‌పై తాము యుద్ధం ప్రకటించామని చెప్పారు. ఈ నెల ప్రారంభంలోనూ ఆయా ప్రాంతాల్లో చేసిన దాడుల్లో డ్రగ్స్ తీసుకున్న 34 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 

Also Read: Horoscope Today June 14th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు..  

Also Read: undavalli on CM Kcr: బీజేపీ పాలిట సీఎం కేసీఆర్ సింహా స్వప్నం..ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News