Bharatheeyudu 2 Closing Collection: తాతను నమ్ముకొని నిండా మునిగిన బయ్యర్స్.. బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా ‘భారతీయుడు 2’..

Bharatheeyudu 2 Closing Collection: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించింది. అపుడెపుడో 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ గా  తెరకెక్కిన ఈ సినిమా గత నెల విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 28, 2024, 10:55 AM IST
Bharatheeyudu 2 Closing Collection: తాతను నమ్ముకొని నిండా మునిగిన బయ్యర్స్.. బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా ‘భారతీయుడు 2’..

Bharatheeyudu 2 Closing Collection: కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కని ఈ సినిమా గత నెల 12న విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ‘భారతీయుడు’ సినిమాలోని ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయింది. పైగా ఈ సీక్వెల్ ను అపుడే నాలుగైదు ఏళ్ల తర్వాత తెరకెక్కిస్తే వర్కౌట్ అయ్యేది. రైలు బండి జీవిత కాలం లేటు అన్నట్టు ఈ సినిమా 28 యేళ్ల తర్వాత రావడం.. అప్పటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. పైగా ఈ సినిమా కంటెంట్ కూడా వీక్ గా  ఉండటం మైనస్ గా మారింది. పైగా వందేళ్ల వృద్ధుడు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అదే  శంకర్ దర్శకత్వంలో 1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా  అప్పటి సమకాలీన పరిస్థితులకు అద్ధం పట్టింది.  అంతేకాదు అప్పట్లోనే తెలుగు, తమిళం ,హిందీలో ఈ సినిమా ఇరగదీసింది. మన దేశంలో తొలి డీటీఎస్ మూవీగా గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.  కేవలం ‘భారతీయుడు’ బ్రాండ్ తో ఈ సినిమాను కథ లేకుండా చుట్టి పడేసి ప్రేక్షకులపై ఒదిలిపెట్టాడు శంకర్. మొత్తంగా తన పాత సినిమలనే అట్టు తిరిగేసిట్టు శంకర్ ఈ సినిమాను పూర్తిగా అడ్డదిడ్డంగా తెరకెక్కించాడనే  పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు శంకర్ సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్ లో  ఆసక్తి ఉండేది. ఇక స్నేహితుడు సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ షురూ అయిందనే చెప్పాలి.  

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.75 కోట్ల షేర్ (రూ. 24.35 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలుగులో రూ. 11.25 కోట్ల నష్టాలను మిగిల్చింది.

భారతీయుడు 2 తమిళం సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.30 కోట్ల షేర్ (రూ. 153.30 కోట్ల గ్రాస్) మాత్రమే రాబట్టింది. మొత్తంగా చేసిన బిజినెస్ కంటే సగం కూడా రికవరీ కాలేదు. మొత్తంగా రూ. 97.70 కోట్ల నష్టాలతో బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక భారతీయుడు రెండు, మూడు పార్టులు కలిపి దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్ అయిందనేది ఇన్ సైడ్ టాక్. కానీ రీసెంట్ గా విడుదలైన ‘భారతీయుడు 2’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మొత్తంగా ‘భారతీయుడు 2’ సినిమాను ఏ కోశానా బాగా తీయలేదు.  మొత్తంగా ఔట్ డేటెడ్ కంటెంట్ తో  భారతీయుడు పార్ట్ 2కే బాక్సాఫీస్ దగ్గర దిక్కు లేకుండా పోయింది. ఇపుడు మూడో పార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తే ఆడియన్స్ ఈ సినిమాను అసలు పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి.  మొత్తంగా ఈ ఇయర్ రిలీజైన   చిత్రాల్లో ఎక్కువ నష్టాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘భారతీయుడు 2’ మూవీ సరికొత్త బెంచ్ మార్క్  రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News