Geetu Vs Baladitya : బాలాదిత్య ఏడుపు.. గీతూ శునకానందం.. శాడిస్ట్ సైకోలా కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu 9th Week Captaincy Task బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం మరో పెద్ద గొడవే జరిగేట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అసలు రూపాలు మరింతగా బయటకు వచ్చేట్టు కనిపిస్తోంది. గీతూ ఎంత శాడిస్ట్ అన్నది మరోసారి ఫ్రూవ్ కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 12:07 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో టాప్ లేచే గొడవ
  • తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్
  • బాలాదిత్యను ఏడిపించిన గీతూ
Geetu Vs Baladitya : బాలాదిత్య ఏడుపు.. గీతూ శునకానందం.. శాడిస్ట్ సైకోలా కంటెస్టెంట్

Geetu Vs Baladitya : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ రోజురోజుకూ దిగజారిపోతోంది. పక్క వారి ఆటలను విశ్లేషిస్తోంది. కానీ తన స్థాయి ఏంటన్నది తాను చూసుకోలేకపోతోంది. బాలాదిత్య చాలా మంచివాడని ఎంత త్వరగా ఎలిమినేట్ అయి పోతే అంత మంచింది అంటూ గీతూ చెప్పింది. రేవంత్ కూడా అంతే.. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది.. అంటూ రివ్యూలు ఇచ్చింది. కానీ గీతూ తన ఆటను రివ్యూ చేసుకోలేకేపోతోంది. తనంత వాళ్లు లేరని, తనే తోపు కంటెస్టెంట్ అని, తనకు మాత్రమే తెలివి ఉందని, తనే గేమర్ అనే భ్రమలో బతికేస్తోంది.

కానీ గీతూకి బయట ఉన్న ఇమేజ్ గురించి, నెగెటివిటీ గురించి తెలుసుకోలేకపోతోంది. తన పేరు గీతూ.. కాదు గీథూగా మారిపోయిందని తెలుసుకోలేకపోతోంది. తన రాక్షసత్వాన్ని, శాడిజనాన్ని, సైకోయిజాన్ని చూపించి అదే తెలివి, బుద్దిబలం అని అనుకుంటోందేమో. బాలా అన్న అంటూ ప్రేమగా పిలిచే గీతూ.. ఆ బాలాదిత్యకు మండేట్టు చేసింది. విల విల కొట్టేసుకునేలా చేసింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ రసవత్తరంగా మార్చాడు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఇలా అంతా ఒకే బ్యాచులో పడేశాడు. శారీరక బలాన్నే కాకుండా బుద్ది బలం కూడా వాడతారని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు అనే పాయింట్‌ను గీతూ నొక్కి చదివింది. అంటే తనకు మాత్రమే తెలివి ఉందని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో అవతలి కంటెస్టెంట్ల వీక్ పాయింట్ మీద కొట్టేద్దామని మరో చెత్త సలహా ఇచ్చింది. గత వారం ఇలానే వీక్ పాయింట్ల మీద కొట్టి ఆడేద్దామని అనుకుని బొక్క బోర్లా పడింది. అయినా బుద్దిరాని, బుద్దిలేని, బుద్ది తెచ్చుకోలేని గీతూ.. కుక్క తోక వంకర అన్నట్టుగానే చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News