Brahmamudi Today March 5th Episode: బుజ్జీప్లాన్ సక్సెస్.. గింజుకుంటున్న మిస్టర్ బడాయి..

Brahmamudi march 5th Episode: కంపెనీకి ఇన్సూరెన్స్ చేయించకపోవడంతో రూ.50 లక్షలు నష్టం వాటిల్లుతుంది. దీంతో సుభాష్ తమ్ముడు ప్రకాశాన్ని తిడతాడు. నీ మతిమరుపు వల్లే ఇంత నష్టం జరిగిందని ఒక్కసారిగా అరుస్తాడు. 

Written by - Renuka Godugu | Last Updated : Mar 5, 2024, 12:26 PM IST
Brahmamudi Today March 5th Episode: బుజ్జీప్లాన్ సక్సెస్.. గింజుకుంటున్న మిస్టర్ బడాయి..

Brahmamudi march 5th Episode: కంపెనీకి ఇన్సూరెన్స్ చేయించకపోవడంతో రూ.50 లక్షలు నష్టం వాటిల్లుతుంది. దీంతో సుభాష్ తమ్ముడు ప్రకాశాన్ని తిడతాడు. నీ మతిమరుపు వల్లే ఇంత నష్టం జరిగిందని ఒక్కసారిగా అరుస్తాడు. ఇది చూసి ధాన్యలక్ష్మి మా ఆయన్ను తిట్టడానికి మీరెవరు? అని అంటుంది. దీంతో సుభా తనకు సారీ చెప్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి సుభాష్ గార్డెన్ ఏరియాలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. కానీ, ప్రకాశం ఇలా దూరంగా ఉంటే నాకు భయంగా ఉంటుందని చిన్నపిల్లాడిలా సుభాషన్ ను పట్టేసుకుని ఏడ్చేస్తాడు. ధాన్యలక్ష్మి అన్న మాటలకు క్షమాపణ అడుగుతాడు. మరోవైపు కావ్య తన పుట్టింట్లో ఉంటుంది. తన బావతో కలిసి క్యారమ్ బోర్డ్‌ సరదాగా అడుతూ రాజ్ ను ఆటపట్టిస్తుంటుంది. రాజ్ కూడా తాను ఆడుతా అని జాయిన్ అవుతాడు. ఇక కావ్య తన బావ భాస్కర్ కలిసి గేమ్ ఆడకుండా పక్కకు తప్పించి లేడీస్ అంతా ఒక జట్టు, జెంట్స్ అంతా ఒక జట్టు అని కావ్య-అప్పు, భాస్కర్, రాజ్ లు మరో జట్టు అని చెప్తాడు. ఇక భాస్కర్ గేమ్ మొత్తం కావ్యను సపోర్ట్‌ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి తట్టుకోలేకపోతుంటాడు రాజ్.కావ్య కూడా తన బావను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక్క స్టైక్ లో మా బావ మూడు కాయిన్స్ వేసేవాడు అని పొగుడుతుంది. రాజ్ ఒక్క కాయిన్ కూడా వేయలేకపోతాడు. దీంతో రాజ్ కు అవమానంగా అనిపిస్తుంది. ఈ గేమ్ మొత్తం పక్కనే కూర్చొని కావ్య అమ్మనాన్న కూడా చూస్తూ ఉంటారు. గేమ్ మొత్తం భాస్కర్ కావ్యను గెలిపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది చూసి రాజ్ తట్టుకోలేక చివరికి నేను ఆటను ఆడను గేమ్ మధ్యలో నుంచే వెళ్లిపోతాడు..

డిజైన్స్ పై పెయింట్..
తన రూంలోకి వెళ్లిపోయి వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తాడు. ఇక కనకం అల్లుడిగారిని ఆటపట్టించిది చాలు అని కావ్యభాస్కర్లను వారిస్తుంది. ఇక గదిలో ఉన్న రాజ్ ఓ పథకం ప్రకారం కావ్య వేసిన నగల డిజైన్స్ పేపర్స్ పై పెయింట్ వేసి పాడు చేస్తాడు. ఆ తర్వాత కావ్యను టీ కావాలి అని పిలుస్తాడు. దీంతో కనకం నేను ఇస్తాను అని వెళ్తుంది. ఇక ఎలాగైనా కావ్యను గేమ్ నుంచి పక్కకు తప్పించాలని రూంలో డిజైన్స్ ఉన్నాయి వెళ్లి తీసుకురా అని చెబుతాడు. అప్పుడు కావ్య రూంకి వెళ్తుంది. ఆ డిజైన్స్ చూసి కంగారు పడిపోతుంది. ఇదేంటి డిజైన్స్ పై ఇంక్ ఎవరు పోసి ఉంటారు అని బాధపడుతుంది.  అప్పుడే కళావతి అనుకుంటూ ఏమి తెలియనట్లు రాజ్ గదిలోకి వస్తాడు.

క్లైయింట్స్ వెయిటింగ్ డిజైన్స్ ఏవీ అని అడుగుతాడు. పొరపాటున డిజైన్స్ పై ఇంక్ పడిందా? అని నోరు జారుతాడు. ఆ తర్వాత ఇవన్నీ నాకు అనవసరం క్లైంట్స్ కు ఏం సమాధానం చెప్పాలి అని తిడతాడు. బావతో సరదాగా ఆడుకుంది చాలు మళ్లీ డిజైన్స్ వేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే కావ్య బావ అక్కర్లేదన్నయ్య నేను కావ్య వేసిన డిజైన్స్ ఫోన్లో ఫోటోలు సేవ్ చేసి పెట్టానని ఫోన్లో డిజైన్స్ చూపిస్తాడు. దీంతో రాజ్‌కు షాక్‌కు గురవుతాడు. ఇప్పుడు మనం కర్రాబిళ్ల ఆడుకుందాం పదా అని అక్కడి నుంచి వెళ్లిపోతారు.

ఇదీ చదవండి: మహేష్ బాబు కొత్త లుక్ కోసం రాజమౌళి బిగ్ స్కెచ్.. నెవర్ బిఫోర్ లెవల్లో..

మరోవైపు అపర్ణ తన అత్త ఇందిరా దేవితో సుభాష్, ప్రకాశం గొడవ గురించి చెబుతుంది. మీరూ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోండి. రోజురోజుకు ధాన్యలక్ష్మి ప్రవర్తన దిగజారుతుంది. ఇలా అయితే, ఎవరికి వాళ్లు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. కుటుంబంలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వెళ్లిపోతుంది. అసలు ధాన్యలక్ష్మికి ఏమైందని ఇందిరా దేవి ఆలోచనలో పడిపోతుంది.

ఇదీ చదవండి: ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ..

కనకం ఇంట్లో కావ్య భాస్కర్, రాజ్ అందరూ కుటుంబసమేతంగా చలిమంట వేసుకుని డ్యాన్సులు చేస్తుంటారు. కావ్య భాస్కర్ల డ్యాన్స్ చూసి తట్టుకోలేకపోతుంటాడు. ఈలోగా కావ్య నిప్పుపై కాళు పెట్టబోతుండగా రాజ్ తన చేతులతో పక్కకు తోసేస్తాడు దీంతో భాస్కర్ ఆ నిప్పును తొక్కుతాడు. తనకు ఏం కాలేదని భాస్కర్ కు ఎక్కువగా కలిందని చెబుతున్నా కావ్యక మాత్రం రాజ్ చేయిని వదలకుండా గాయాన్ని చూస్తూ బాధపడుతుంటుంది. భాస్కర్ గాయం బాధతోనే ఆ ఇద్దరి అప్యాయతను సంతోషంగా చూస్తూ ఉండిపోతాడు.. నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News