Chiranjeevi-Rajamouli-Koratala Siva-Acharya మెగాస్టార్ చిరంజీవి మీద ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆచార్య దెబ్బను ఇంకా మరిచిపోక ముందే.. గాడ్ ఫాదర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా మీద మెగా అభిమానులే ఆశలు వదులుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమా మీద కించిత్ అంచనాలు కూడా పెంచలేకపోయింది చిత్రయూనిట్. తమన్ సంగీతం తేలిపోయింది. అన్నీ కాపీ ట్యూన్స్ అని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి ఉన్న ఫ్రేమ్స్ కూడా ఆకట్టుకునేలా లేవు. తార్ మార్ తక్కర్ మార్ స్టెప్పుల మీద ఏ రేంజ్ ట్రోల్స్ నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇలా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కంటే ముందే దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
మలయాళంలో మోహన్ లాల్ చేసిన లూసీఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది చాలదన్నట్టుగా ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించబోతోన్నాడు. ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ కారెక్టర్లో సల్మాన్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. ఇక ఇందులో వాడిని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ మీద కూడా దారుణంగా ట్రోలింగ్ నడిచింది. మరీ ముఖ్యంగా చిరు లుక్, మేకోవర్ మీద మీమ్స్, ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడా కూడా సీరియస్ నెస్ కనిపించడం లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఇక సినిమా విడుదల అయిన తరువాత కచ్చితంగా మోహన్ లాల్, లూసిఫర్లతో కచ్చితంగా పోలికలు వస్తాయి. దీంతో గాడ్ ఫాదర్ విషమ పరీక్షను ఎదుర్కోవాల్సిందే. మరోసారి ఆచార్య ఫలితమే ఎదురవుతుందా? అని చిరంజీవి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ అంటూ చిరంజీవి నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆచార్య ఫెయిల్యూర్, రాజమౌళితో నటించడం వంటి విషయాల మీద ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
తాను రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అనుకోవడం లేదని అసలు విషయాన్ని చెప్పేశాడు చిరంజీవి. రాజమౌళి ఒక సినిమా కోసం ఐదారేళ్లు కేటాయిస్తాడు.. కానీ నేను ఒకే సారి ఐదారు సినిమాలు చేస్తున్నాను.. అందుకే ఆయన దర్శకత్వంలో నటించాలని లేదు.. పాన్ ఇండియన్ నటుడ్ని అనిపించుకోవాలని లేదంటూ నవ్వుతూ అనేశాడు.
ఆచార్య విషయంలో ఓ చిన్న బాధ ఉందని, రామ్ చరణ్ తాను కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో కాస్త బాధగా ఉందని అన్నాడు. అది సరిగ్గా ఆడలేదని ఒప్పుకున్నాడు. అయినా కొరటాల చెప్పింది చేశామని, హిట్ ఫ్లాప్ అనేది కలెక్టివ్ డెసిషన్ అని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చాలా మెచ్యూర్డ్ అని హిట్ ఫ్లాఫులతో ఎఫెక్ట్ అవ్వడని కొడుకుని పొగిడేశాడు చిరంజీవి.
Also Read : Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్
Also Read : suriya-soorarai pottru : జాతీయ చలన చిత్ర అవార్డులు.. మెరిసిన 'జ్యోతి'క-సూర్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి