Acharya song controversy: మెగాస్టార్ చిరంజివి, ఆయన తనయుడు రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలుగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలోని ఐటం సాంగ్‌పై ఏపీలో హోం మంత్రికి ఫిర్యాదు చేశారు (Acharya item song in controversy) ఆర్ఎంపీ డాక్టర్లు. తమను అవమానించేలా ఆ పాటలో లిరిక్స్ ఉన్నాయని తమ ఫిర్యాదులో (Complaint on Acharya Item Song) పేర్కొన్నారు.
వివాదం గురించి పూర్తి వివరాలు ఇలా..
ఆచార్య సినిమాలో హీరోయిన్ రెజీనా చేసిన స్పెషల్ సాంగ్ 'సానా కష్టం' ఇటీవలే (Saana Kastam song for Acharya) యూట్యూబ్‌లో విడుదలైంది.
భాస్కర బట్ల రాసిన ఈ పాట లిరిక్స్‌లో ఓ చోట.. 'ఎక్కడెక్కడో నిమరొచ్చని కుర్రాలు ఆర్ఎంపీలు అవుత్నారు' అని ఉంది. పాటలో ఈ లిరిక్స్ వ్యంగ్యంగా తమను కించ పరిచేలా ఉన్నాయంటూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు సహా పలువురు సభ్యులు (AP RMP doctors on Acharya item Song ) ఏపీ హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు.
తమను అవమనానించినట్లు ఉన్న ఆ లిరిక్స్‌ను పాట నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఆచార్య సినిమా గురించి..
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం (About Acharya movie) వహించారు. చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. రామ్ చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు నిర్మాతలు.
గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 4గా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. కరోనా థార్డ్ వేవ్ భయాల నేపథ్యంలో పలు సినిమాలు వాయిదా పడిన నేపథ్యంలో అనుకున్న తేదీకి ఆచార్య రిలీజ్ అవుతుందా లేదా అనేది (Acharya movie release date) సందేహంగా మారింది.
Also read: Director Sukumar: దర్శకుడు సుకుమార్‌పై మణిరత్నంకు ఎందుకు కోపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook