shrasti verma mass steps on pushpa 2 sooseki couple song video: పుష్ప2 సినిమా దేశంలో అనేక రికార్డులను తిరగ రాసిందని చెప్పుకొవచ్చు. ఈ మూవీకి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తుందని తెలుస్తొంది. అయితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్నకెరియర్ లోనే దిబిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలుస్తుందని తెలుస్తొంది. ప్రస్తుతం ఈ మూవీ ఒకవైపు రోజు రోజుకు కొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది.
Sooseki Rehearsal 💃🕺❤️🔥@alluarjun @iamRashmika #Pushpa2 @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/WIbUVl9fnH
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) January 3, 2025
మరొవైపు ఈ మూవీకి కాంట్రవర్సీ పరంగా కూడా భలే పబ్లిసిటీ దొరికిందని కూడా చెప్పుకొవచ్చు. అయితే.. పుష్ప2 సినిమా నేపథ్యంలో.. డిసెంబర్ 4న తొక్కిసలాటలో రేవత్ అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ ఘటన మాత్రం మూవీ టిమ్ కు పెద్ద దెబ్బగా మారిందని చెప్పుకొవచ్చు.
అయితే.. ఈ ఘటన మాత్రం చాలా బాధకరమని ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తు, అండగా ఉంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ మూవీలోని పాట సూసేటీ అగ్గి రవ్వ మాదిరి .. అనే పాట ఈ మూవీకి హైలెట్ గా నిల్చిన విషయం తెలిసిందే.
ఈ పాటకు అల్లు అర్జున్, రష్మిక మందన్న అదిరిపోయే విధంగా స్టెప్పులు వేశారు.ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసిన.. ఈపాటకు చాలా మంది డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేశారు. అయితే..ఈ పాటను గణేష్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రేష్టి వర్మ దీనికి అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ గా పనిచేశారు.
ఈ పాటకు.. శ్రేష్టి వర్మ..గతంలో రిహర్సల్ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం శ్రేష్టివర్మ టాలెంట్ కు ఫిదా అవుతున్నారంట. అయితే... శ్రేష్టివర్మ.. ఢీ జొడితో తన కెరిర్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తొంది. అదే విధంగా ఆమె శేఖర్ మాస్టర్,జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter