Daaku Maharaaj: వెంకటేష్ సినిమా విడుదలైన వేళ.. బాలకృష్ణ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..!

Daaku Maharaaj collections: సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహారాజ్ జనవరి 12న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా మూడవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 15, 2025, 10:54 AM IST
Daaku Maharaaj: వెంకటేష్ సినిమా విడుదలైన వేళ.. బాలకృష్ణ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..!

Daaku Maharaaj day 3 collections: ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. అందుకు ముఖ్య కారణం ఇద్దరు స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ అందుకోవడం. సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రంతో రాగా.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. 

ఈ రెండు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు విడుదలైన గేమ్ చేంజెర్ చిత్రం డిజాస్టర్ టాక్ అనుకోవడంతో.. ప్రస్తుతం ఈ రెండు సినిమాల థియేటర్ హౌస్ఫుల్ బోర్డులు వేసుకుంటూ దూసుకుపోతున్నాయి. 

డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనే కొత్త రికార్డులు సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.67.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.5.40 కోట్లు వసూలు చేస్తూ మొత్తం రూ.80.70 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ సాధించింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికం.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో విలన్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. థమన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే..డాకు మహారాజ్ మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా డే 1 కలెక్షన్లు రూ.56 కోట్లుగా నమోదయ్యాయి. రెండో రోజుకు ఈ జోరు కొనసాగి, రూ.13.50 కోట్లను వసూలు చేసింది. మూడో రోజు కూడా అదే జోరును చూపిస్తూ, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.12.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తం మూడు రోజుల్లో దేశీయంగా రూ.50.17 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లు సాధించి ప్రేక్షకులను ఆకర్షించింది. మొత్తానికి.. నిన్న మంగళవారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైనప్పటికీ.. బాలకృష్ణ సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు.

ఈ చిత్రానికి బాలయ్య యాక్షన్, బాబీ కొల్లి దర్శకత్వం, థమన్ మ్యూజిక్ కీలకమైన కారణాలుగా నిలిచాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ వల్ల డాకు మహారాజ్ కలెక్షన్ల పరంగా భారీగా ముందుకు దూసుకుపోతోంది.  బాలయ్య 'గాడ్ ఆఫ్ మాసెస్'గా మరోసారి నిరూపించుకుంటూ బాక్సాఫీస్‌ పై తన ప్రభావాన్ని చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News