Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

Captain Miller Teaser:  ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ టీజర్ ను ఆగస్టు 10 నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 11:09 AM IST
Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

Captain Miller Teaser Update:  కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌ (Captain Miller). అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి కథగా ఈ మూవీని రూపొందించారు. పుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

తాజాగా ఈ మూవీ నుండి ఓ అప్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. ఇవాల్టి నుంచి బిగ్‌ స్క్రీన్స్‌లో కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ సందడి చేయనుందని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. సౌత్ ఇండియా వ్యాప్తంగా 3500కిపైగా సెంటర్లలో కంటెంట్‌ లోడింగ్‌ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ధనుష్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

Also Read: Hidimba Movie: కౌంట్ డౌన్ స్టార్ట్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'హిడింబ'.. ఎక్కడ చూడొచ్చంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News