Jabardasth Show Comedian Hyper Aadi Assets: హైపర్ ఆది.. ఈ పేరు పెద్దగా తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ప్రజల్లో, యూట్యూబ్ లో ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన హైపర్ ఆది.. సినిమాల్లో, ఈవెంట్ లలో అలరిస్తూ బాగా బిజీ అయిపోయారు. తనదైన కామెడీ పంచులతో.. టైమింగ్ తో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
ప్రతి వారం హైపర్ ఆది స్కిట్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. స్పెషల్ గా హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ ప్రోగ్రామ్ (Jabardasth Tv Show) చూసే వారు ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. శరీరాకృతిపై కామెంట్స్ చేసిన.... కొన్ని స్కిట్ లలో పొలిటికల్ సెటైర్లతో.. సామాజిక సమస్యలపై కూడా కామెడీ చేస్తూ నవ్విస్తుంటాడు.
Also Read: Snake Hair Band: హెయిర్ బ్యాండ్‌గా బతికున్న పాము.. ఇదెక్కడి ఫ్యాషన్ అంటున్న నెటిజన్లు
ఇదిలా ఉండగా... ఇపుడు హైపర్ ఆది (Hyper Aadi) ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈవెంట్, షోలను బట్టి రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడట ఈ జబర్దస్త్ కమెడియన్. ప్రస్తుతం ఒక్క స్కిట్ చేసినందుకు లక్షల్లోనే తీసుకుంటున్నాడని.. ఏడాదికి కోటీ రూపాయలపైనే సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.
బుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఆది, అపుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ.. సంపాదనలో ఇతర కామెడియన్లతో ముందున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.. ఇటీవలే సొంతూరులో 16 ఎకరాలు కొనుగోలు చేసాడని, ఇపుడు హైదరాబాద్ లో కూడా మంచి ఖరీదైన ఇల్లు కొన్నాడని తెలుస్తుంది.
Also Read: Bank Holidays in November: నవంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!
సాఫ్ట్వేర్ (Sofware) ఉద్యోగం వదిలేసి.. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హైపర్ ఆది.. ఇపుడొక సెలబ్రెటీ.. చేతినిండా షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఇతర జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆదిని చూసి నేర్చుకోవాలంటూ ఇండస్ట్రీ జనాలు సలహాలు ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి