Nayantara-Mammooty: 2005లో మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన రప్పకల్ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడి కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. అప్పటినుంచి నయనతార, మమ్ముట్టిల.. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కు మలయాళం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత కలిసి కొన్ని సినిమాల్లో నటించిన మమ్ముట్టి, నాయనతార.. ఆఖరిగా 2016లో విడుదలైన పుతియ నియమం సినిమాలో నటించారు. ఏకే సాజన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఆ తరువాత నయనతార ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. నయనతార తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అప్పుడప్పుడు.. మలయాళంలో కూడా మంచి హిట్లు అందుకున్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు మమ్ముట్టి నయనతార కాంబినేషన్ లో త్వరలో మరో సినిమా సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గ మరో విశేషమేమిటి అంటే ఈ సినిమా కోసం ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో స్టార్ట్ డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ గత కొంతకాలంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
కాగా గౌతమ్ మీనన్, మమ్ముట్టి, నయనతారల కాంబినేషన్ సెట్ అయింది అంటే ఇంకా ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఈ చిత్రం మలయాళం సినిమానా లేక తమిళ సినిమానా అని మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకవేళ ఇది మలయాళం సినిమా అయ్యి ఉంటే ఈ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెడుతున్నారు గౌతమ్ మీనన్. సినిమాకి కొంచెం మంచి టాక్ వచ్చినా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సినిమా హిట్ అవ్వడంతో పాటు.. గౌతమ్ మీనన్ కి మలయాళం లో కూడా మంచి పేరు వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరోవైపు మమ్ముట్టి త్వరలో టర్బో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. నయనతార కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆఖరిసారిగా నాయనతార 2023లో విడుదలైన అన్నపూరాని అనే సినిమాలో నటించింది.
Also Read: Betting Murder: బెట్టింగ్ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య
Also Read: Mothers Day: మదర్స్ డే రోజే తీరని విషాదం.. 'అమ్మా' అంటూ తల్లీని కాపాడబోయి కొడుకు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter