Guntur Kaaram Closing Box Office Collections: గుంటూరు కారం వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో ఈ వ‌సూళ్లు ఏంది సామి..

Mahesh Babu - Guntur Kaaram WW Closing Collections: సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లైన సినిమాల్లో హ‌నుమాన్ మాత్ర‌మే ఇప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌న్ అవుతూ ఉంది. ఈ సినిమాకు పోటీగా విడుద‌లైన చిత్రాల థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసింది. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన గుంటూరు కారం సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 19, 2024, 11:11 AM IST
Guntur Kaaram Closing Box Office Collections: గుంటూరు కారం వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫ్లాప్ టాక్‌తో ఈ వ‌సూళ్లు ఏంది సామి..

Mahesh Babu - Guntur Kaaram WW Closing Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాతో పోటీగా విడుదలై డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబోలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ బిగ్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్‌తో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల స్టార్ ఇమేజ్ తోడు కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది.  

గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ మూవీకి బాగానే కలిసొచ్చాయి. ఈ మూవీ రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు  కొంచెం ఇబ్బందిగా మారింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును  సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే  రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.

బడా స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు త్రివిక్రమ్‌కు వచ్చింది. కన్నతల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా కథ మొత్తాన్ని నడింపించాడు గురూజీ. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను రాసుకున్నాడు మాటల మాంత్రికుడు. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడనే అపవాదును గురూజీ మూటగట్టుకున్నారు.

ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసిన కుచ్చీ మడతపెట్టి లిరికల్ సాంగ్ విడుదలైన నెల రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఈ సినిమా ఫుల్ సాంగ్ 2 వారాల్లో 51 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఓవరాల్‌గా 152 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పాలి.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ క్లోజింగ్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా  రూ. 111 కోట్ల షేర్.. (రూ. 184.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. గుంటూరు కారం  సినిమా థియేట్రికల్‌గా  రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.

Also read: AP Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News