Hamsa Nandini Cancer Treatment టాలీవుడ్ నటి హంసా నందిని రెండేళ్ల క్రితం తాను క్యాన్సిర్ బారిన పడిన విషయాన్ని బయటపెట్టేసింద. అయినా తానేమీ కుంగిపోనని, ధైర్యంగా పోరాడుతానని చెప్పుకొచ్చింది హంసా నందిని. అయితే తాజాగా హంసా నందిని హైద్రాబాద్‌లోకి అడుగు పెట్టేసింది. మునుపటి కంటే మరింత అందంగా గ్లామరస్‌గా రెడీ అయింది. చూస్తుంటే హంసా నందిని క్యాన్సర్‌ను జయించినట్టుగానే అనిపిస్తోంది. హంసా నందినిని చూసి అంతా ఫిదా అవుతున్నారు. స్ట్రాంగ్ లేడీ అని కీర్తిస్తున్నారు.
Thankful through everything 🧚♀️.
.#swanstories pic.twitter.com/SUmsQCHE1t— Hamsa Nandini (@ihamsanandini) January 7, 2023
రెండేళ్ల క్రితం హంసా నందిని ఇలా తనకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ప్రకటించింది. బ్రెస్ట్‌లో చిన్న గడ్డల్లా అనిపించాయి.. ఇకపై తన లైఫ్ మునుపటిలా ఉందని అర్థమైందట. చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో అంధకారంలోనే పెరిగానంటూ తన లైఫ్ కష్టాలను చెబుతూ క్యాన్సర్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చెప్పేసింది హంసా నందిని. రెండేళ్ల క్రితం హంసా నందిని వేసిన ఎమోషనల్ పోస్ట్ చూసి అందరూ చలించిపోయారు.
త్వరగానే తనకు క్యాన్సర్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నానని, చికిత్స తీసుకుంటున్నాను అని హంసా నందిని నాడు ఓ పోస్ట్ వేసింది. అయితే ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. నువ్ నిజమైన ఉక్కు మహిళవి, ఎంతో ధైర్యంగా క్యాన్సర్‌ను ఎదుర్కొన్నావ్ అంటూ ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
వంశీ అనుమానాస్పదం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హంసా నందిని.. ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ చేసింది. స్పెషల్ అప్పియెరెన్స్ ఇస్తూ అందరినీ మెప్పించింది. మిర్చి ఐటం సాంగ్‌తో, ఈగలో చేసిన ఓ స్పెషల్ రోల్‌తో హంసా నందినికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. హంసా నందిని ఐటం సాంగ్ చేస్తే ఆ సినిమా హిట్టే అనే రేంజ్‌కు వెళ్లింది.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి