Aparanji Bomma Maa Amma song: మదర్ సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయి. ‘మాతృ దేవో భవ’ నుంచి ‘బిచ్చగాడు’ వరకు అనేక చిత్రాలు ఎమోషనల్‌గా ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నాయి. ఇప్పుడు అదే భావోద్వేగంతో.. ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా, బి. శివ ప్రసాద్ సాహిత్యం అందించారు. శేఖర్ చంద్ర అందించిన బాణీ పాటను మరింత హృదయాస్పదంగా మార్చింది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ చిత్రంలోని పాటలతో.. బ్లాక్ బస్టర్ అందుకునేలా కనిపిస్తున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. నాని సినిమాలో ఒకప్పుడు పెదవే పలికిన మాటల్లోనా సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో.. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అంతటి విజయం సాధించేలా ఉంది.
ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్, అలీ, ఆమని, కాలే రవి, దేవి ప్రసాద్, పృధ్వి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై జాన్ జాకీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బి. శివప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సత్యనారాయణ బల్లా ఎడిటర్ గా.. రాహుల్ శ్రీవత్సవ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
Also Read: Koneru Konappa: రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.