Jeevitha Comments On Aaryavaishya Community: జీవిత రాజశేఖర్ ఇటీవల జరిగిన శేఖర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో తన కూతుళ్ల వైఖరి గురించే మాట్లాడుతూ.. '' కోమటిదానిలెక్క'' అంటూ ఆర్యవైశ్య కులం పేరుతో చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. కోమటోళ్లలెక్క, కోమటిదానిలెక్క అంటూ తమను కించపరిచినట్టుగా జీవిత రాజశేఖర్ అలా ఎలా మాట్లాడుతారు అంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జీవిత వైఖరి తమ మనోభావాలను గాయపరిచిందంటూ ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో చేసిన తప్పును గ్రహించుకుని నాలుక్కర్చుకున్న జీవిత రాజశేఖర్... ఆర్యవైశ్య సంఘాల వారికి క్షమాపణలు చెప్పారు.
అయితే, తాను వారిని కించపరిచే ఉద్దేశ్యంతో ఆ మాటలు అనలేదని జీవిత చెప్పినప్పటికీ.. ఆర్యవైశ్యులు మాత్రం ఇంకా సంతృప్తి చెందడం లేదు. సమాజంలో నలుగురిని ప్రభావితం చేసే స్థాయిలో ఉండి సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వారు అలా నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడతారని ఆర్యవైశ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా.. జీవిత ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత సింపుల్‌గా క్షమాపణలు చెబితే సరిపోతుందా అని ఇంకొంతమంది మండిపడుతున్నారు. కులం పేరుతో కించపర్చడం, దూషించడం ఎందుకు.. ? ఆ తర్వాత అపాలజీ చెప్పడం ఎందుకు ? అంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సెలబ్రిటీలు ఒక కులం గురించి నోరు జారడం, లేదా ఒక కులం వారిని నొప్పించేలా వ్యవహరించడం ఇదేం మొదటిసారి కాదు. ఈమధ్యే మంచు మోహన్ బాబు తన వద్దే పని చేసే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనుపై దుర్భాషలాడారానే వివాదం ఎంత వరకు వెళ్లిందో మనందరికీ తెలిసిందే. గతంలో కమెడియన్ వేణు ఓ కామెడీ షోలో చేసిన స్కిట్ కల్లు గీత కార్మికుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చివరకు గౌడన్నలు ఫిలించాంబర్ వద్దే వేణుపై దాడి చేసేంత వరకు వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అలాగే, ప్రొఫెసర్ కంచె ఐలయ్య సైతం ఆర్యవైశ్య కులం గురించి రాసిన ఓ పుస్తకం అప్పట్లో పెనుదుమారం రేపింది. దీనిపై కూడా అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.
ఈ నేపథ్యంలో జీవిత వ్యాఖ్యలపై ఆర్యవైశ్య సంఘాలు ఏం చెబుతున్నాయి ? జీవిత లాంటి సెలబ్రిటీల నుంచి వాళ్లు ఏం కోరుకుంటున్నారు ? ఇదే విషయమై చర్చించేందుకు ఆర్యవైశ్య సంఘాల తరపున ప్రతినిధిగా కాచం సత్యనారాయణ, అలాగే బీజేపి గౌడ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల విక్రమ్ గౌడ్, తెలంగాణ నాయి బ్రాహ్మణ జన శక్తి సేవా సంఘం అధ్యక్షుడు పసుపుకుంట్ల వికాస్ నేటి జీ తెలుగు న్యూస్ లైవ్ డిబేట్‌లో పాల్గొన్నారు. జీవిత వివాదాస్పద వ్యాఖ్యల (Jeevitha Rajasekhar comments) గురించి ఎవరేం చెబుతున్నారో తెలియాలంటే.. ఇదిగో ఈ లైవ్ డిబేట్ వీడియో వీక్షించాల్సిందే.
Also read : Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...
Also read : Niharika Konidela: భర్తకు నిహారిక లిప్‌లాక్.. రెచ్చిపోయిన నెటిజన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook