Kajal Aggarwal wedding: కాజల్ అగర్వాల్ పెళ్లి వాయిదా

Kajal Aggarwal wedding postponed ? కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ అమ్మడు. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి ( Kajal Aggarwal marriage ) గురించి మీడియాలో అనేక వార్తలొచ్చాయి.

Last Updated : Sep 22, 2020, 08:45 PM IST
Kajal Aggarwal wedding: కాజల్ అగర్వాల్ పెళ్లి వాయిదా

Kajal Aggarwal wedding postponed ? కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ అమ్మడు. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి ( Kajal Aggarwal marriage ) గురించి మీడియాలో అనేక వార్తలొచ్చాయి. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌కి ( Nisha Aggarwal ) 2013లోనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అయిన విషయం తెలిసిందే. 2018లో నిషాకి బాబు కూడా పుట్టాడు. కానీ కాజల్ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని, ఇంకా ఎప్పుడూ పెళ్లి చేసుకుంటావు అని కాజల్ తల్లిదండ్రులు కాజల్‌ని ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపించింది. అందుకే ఇంటా, బయట పెళ్లి పోరు పడలేని కాజల్ అగర్వాల్.. 2020లో పెళ్లి చేసుకుంటానని గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పెళ్లి అనేది ఒక గొప్ప వేడుక అని అభిప్రాయపడిన కాజల్.. 2020లో ఘనంగా తన పెళ్లి వేడుక చేసుకోనున్నట్టు వెల్లడించింది.

కాజల్ అగర్వాల్ తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అలాగే ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తతో కాజల్ ఎంగేజ్మెంట్ ( Kajal Aggarwal engagement rumours ) చేసుకుంది అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. 

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన ప్రణాళికలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా కాజల్ తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. Also read : Sarkaru Vaari Paata actress: సర్కార్ వారి పాట నుంచి కీర్తి సురేష్ ఔట్ నిజమేనా ?

అంతేకాకుండా కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ సరసన ‘భారతీయుడు 2’ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా భారతీయుడు 2 షూటింగ్‌ను ( Indian 2 movie shooting ) పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కరోనా కారణంగా మిగితా షూటింగ్ ఆగిపోయింది.

కాజల్ 'భారతీయుడు 2' సినిమాతో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా  ( Acharya movie ) షూటింగ్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలను పూర్తి చేయడమే కాజల్ ప్రాధాన్యత అని తెలుస్తోంది. అందుకే తన పెళ్లిని వచ్చే ఏడాదికి ప్లాన్ చేసినట్టు టాక్. Also read : RRR movie: రాజమౌళికి ఆలియా భట్ స్పెషల్ రిక్వెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News