Kajal Aggarwal: అక్కడ నంబర్ వన్ ట్రెండింగ్ లో కాజల్ అగర్వాల్ "సత్యభామ" మూవీ..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె సత్యభామ సినిమాతో పలకరించింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నంబర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 4, 2024, 03:47 PM IST
 Kajal Aggarwal: అక్కడ నంబర్ వన్ ట్రెండింగ్ లో కాజల్ అగర్వాల్ "సత్యభామ" మూవీ..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ లా మారింది. గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాతో పలకరించింది. ఆ తర్వాత కాజల్ టైటిల్ రోల్లో ‘సత్యభామ’ సినిమాతో పలకరించింది. థియేట్రికల్ గా అంతగా నడవని  ఈ సినిమా గత నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్  ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో “సత్యభామ” ట్రెండింగ్ అవుతోంది.

ఈ సినిమా తక్కువ టైమ్ లో  100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది.  ఈ సినిమాలో  ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఈ సినిమా జూన్  7వ తేదీన థియేట్రికల్ గా రిలీజైంది.  ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా అలరించింది.  

ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎలా కష్టపడి ఈ కేసును ఛేధించిందనేదే ఈ సినిమా స్టోరీ. అంతేకాదు బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో గుండెలకు హత్తుకునేలా ఇంటెలిజెంట్ గా చూపించారు దర్శకుడు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి.

సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.   “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించారు. అంతేకాదు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరోవైపు కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూన్న ‘కన్నప్ప’ పార్వతి మాత పాత్రలో నటిస్తోంది.

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News