Emergency movie banned in Telangana: బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటీవల రాజకీయాలలోకి కూడా ప్రవేశించింది. బిజెపి తరఫున మండి నుంచి పోటీ చేసిన ఈమె అక్కడ ఎంపీగా గెలుపొందింది. ఇక మరొకవైపు తాజాగా ఈమె నటించిన చిత్రం ఎమర్జెన్సీ. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలంగాణలో బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఎమర్జెన్సీ చిత్రాన్ని దివంగత రాజకీయ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఈమె దర్శకత్వం వహిస్తోంది కూడా. అయితే తాజాగా ఈ సినిమాని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో సినిమా విడుదలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు.
ఇండియన్ పోలీస్ సర్వీస్ మాజీ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలో తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో షబ్బీర్ ను కలిసి ఎమర్జెన్సీ స్క్రీనింగ్ పై నిషేధం విధించాలని అభ్యర్థించారు. ముఖ్యంగా 18 మంది సభ్యుల ప్రతినిధి బృందం సినిమాలో సిక్కు సమాజాన్ని చాలా తప్పుగా చిత్రీకరించారని పేర్కొంటూ.. సినిమాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక రిప్రజెంటేషన్ కూడా సమర్పించారు.
ఇందులో సిక్కులను తీవ్రవాదులుగా , దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించారని , ఇది ఆక్షేపనీయమైనది అని, సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించారు అంటూ ప్రతినిధి బృందం ఆరోపించింది.
ఇకపోతే తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని కోరగా.. ఇప్పుడు తాజాగా సినిమాను బ్యాన్ చేసినట్లు తెలిపారు. మొత్తానికైతే సిక్కుల కు అవమానం జరిగిందన్న నేపథ్యంలో తెలంగాణలో ఎమర్జెన్సీ చిత్రంపై నిషేధం విధించారు. మరి దీనిపై కంగనా రనౌత్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. మొత్తానికి అయితే తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదలయితే సక్సెస్ అవుతుందని తెగ సంబరపడిపోతున్న కంగనాకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.