KGF: Chapter 2 సినిమా ఇప్పటికే థియేటర్లోకి వచ్చేయాల్సింది. కానీ కరోనావైరస్ వల్ల సినిమా చిత్రీకరణ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఇటీవలే మళ్లీ టీమ్ మొత్తం షూటింగ్ లో బిజీ అయింది. త్వరలో కేజీఎఫ్ చాప్టర్ 2లో ( KGF: Chapter 2 ) అధీరాగా కనిపించనున్న సంజయ్ దత్ ( Sanjay Dutt ) కూడా నవంబర్ నెల నుంచి షూటింగ్ లో పాల్గొనున్నాడు.
READ ALSO | RRRపై సస్పెన్స్ పెంచిన రామ్ చరణ్, తారక్ ట్వీట్స్
కొంత కాలం క్రితమే అధీరా లుక్ ఎలా ఉంటుందో దర్శకుడు షేర్ చేశాడు. తాజాగా చాప్టర్ 2లో రీనా అంటే రాకీ భాయ్ లవ్ అండ్ వైఫ్ పాత్ర పోషిస్తున్న శ్రీనిధి శెట్టి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో విడుదల చేశాడు ప్రశాంత్ నీల్.
ఇవాళ శ్రీనిధి ( Srinidhi Shetty ) 28వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లుక్ షేర్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందులో సిల్వర్ బ్లాక్ లెహెంగాతో పాటు బ్లాక్ దుపట్టా వేసుకున్న శ్రీనిధి సింపుల్ గా కనిపించినా అందులో ఒక పవర్ కంట్రోలింగ్ అప్పియరెన్స్ ఉంది. ఆ పోస్టర్ ను గమనిస్తే వెనక రాకీ భాయ్ ( Rocky Bhai KGF) మరోవైపు చూస్తూ కనిపిస్తాడు.
శ్రీనిధి లుక్ పై కామెంట్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఇలా ట్వీట్ చేశాడు.
ప్రేమ, కర్కశత్వం కలిసి ఉండగలవా .. ? మా రీనా , శ్రీనిధి శెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు
యష్ ( Yash ) హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF: Chapter 1) జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. దీంతో చాప్టర్ 2పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Can Love and Brutality Coexist.....? ❤️⚔️
Wishing our Reena, @SrinidhiShetty7 a very Happy Birthday. #HBDSrinidhiShetty #KGFChapter2 pic.twitter.com/JS4xqHHXL4— Prashanth Neel (@prashanth_neel) October 21, 2020
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR