Dussehra Movies: దసరా సందడి ప్రారంభమైపోయింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు కావడంతో సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఏ సినిమా ఎప్పుడో చూద్దాం..
విజయదశమి వేడుకలు ప్రారంభమయ్యాయి. దసరా వేడుకల్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలకు సెలవులు కూడా ఇచ్చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం అధికారికంగా అక్టోబర్ 6 వరకూ సెలవులు ప్రకటించగా, తెలంగాణలో అక్టోబర్ 9 వరకూ సెలవులున్నాయి. ఈ క్రమంలో సినిమాలు సందడి చేసేందుకు సిద్దమౌతున్నాయి. ఒకదాని తరువాత మరొకటిగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సెప్టెంబర్ 29 అంటే ఇవాళ ధనుష్ నటించిన నేనే వస్తున్న చిత్రం విడుదలైంది. రేపు అంటే సెప్టెంబర్ 30వ తేదీన ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వం పార్ట్ 1 విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో ఇప్పటికే ఉత్తరాది సినీ విమర్శకులు మంచి క్రిటిక్స్ ఇచ్చారు. ఇక అక్టోబర్ 5వ తేదీన చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 5న విడుదల కావడం లేదు. ఆ రోజున ట్రైలర్ విడుదలవుతోంది. అక్టోబర్ 21న థియేటర్ రిలీజ్ ఉంది.
ఇక ఓటీటీ విషయానికొస్తే..ఈ వారం మంచి కంటెంట్ సినిమాలే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, విక్రమ్ కోబ్రా వంటి సినిమాలున్నాయి. మరోవైపు ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర త్వరలో అంటే అక్టోబర్ మూడవ వారంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్, అక్కినేని నాగార్జున వంటి నటులున్నారు. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పించడం విశేషం.
Also read: Manchu Vishnu: దీపావళి కానుకగా జిన్నా సినిమా, సినీ పరిశ్రమ విడిపోవడానికి కారణం మీడియానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook