Devara Collections: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ.. దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన.. చిత్రం దేవర. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలయ్యింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ మొదలై ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ విషయాన్ని దేవర ప్రమోషన్స్ లో కొరటాల ఆసక్తికర కామెంట్లు చేశారు.
“ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే దానికి ఒత్తిడి ఏమి మేము పడలేదు. ఈ సినిమాకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాము. ఆచార్య విడుదలైన 20 రోజుల్లోనే.. దేవర సినిమా.. మోషన్ పోస్టర్ చేసే పనిలో పడ్డాను. ఆచార్య తర్వాత వెంటనే దేవర వర్క్ మొదలు పెట్టాను.” అంటూ కొరటాల శివ కామెంట్లు చేశారు.
‘దేవర సెకండ్ షెడ్యూల్ సమయంలో ఇంత పెద్ద కథను మూడు గంటల్లోపు మనం చెప్పగలమా..అని అందరం అనుకున్నాము. ఎందుకంటే నెరేషన్ మాత్రం నాలుగు గంటలు ఉంది. పేపర్ మీద పెట్టినప్పుడేమో అది 7 గంటలు అయింది. సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంటల్లో ఈ కథను చెప్పలేమని మాకు అర్థం అయిపోయింది. అందుకే రెండు పార్ట్స్ గా వద్దనుకునే ఇలా రివర్స్లో వెళ్ళాము అయితే కుదరదు అని తెలిసి రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాము..
నిజానికి మేము బిజినెస్ కోసమో లేక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమో ఇలా చేయలేదు. ఒక పార్ట్ లో చెప్పలేని కథను ఇలా రెండు భాగాలుగా చెప్పాలనుకుంటున్నాను. మరొకవైపు సాబు శిరియల్, రత్నవేలు, అనిరుద్, శ్రీకర ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దొరకడం వల్లే వాళ్ళ ..ఐడియాస్ తో వర్క్ చేసుకొని వచ్చాను. అందరూ మంచి టెక్నీషియన్స్ కాబట్టి మంచి ఇన్పుట్ లభించింది” అంటూ తెలిపారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఆచార్య సినిమా విషయంలో భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్న కొరటాల శివ ఈ సినిమాతో అందరి నోళ్లు మూయించారని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. మొదటి షో తోనే హిట్ టాక్ తో దూసుకుపోతోంది దేవర. దీంతో ఆచార్య సినిమాతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ వాటన్నింటికీ ఒక్క సినిమాతో చెక్ పెట్టేశారు. తన మార్క్ మళ్లీ చూపించిన కొరటాల శివ దేవరతో ఎన్టీఆర్ కి కూడా మంచి సక్సెస్ లభించింది.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.