Kulasekhar Lyricist: సినీ ఇండస్ట్రీలో పాటల రచయత దుస్థితి కారణం అదేనా అంతేనా..

Kulasekhar Lyricist: వారు తెరపై కనపడరు. కానీ తెరపై వారి పాటలు మాత్రం ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి. కానీ తెర వెనక ఓ పాట కోసం వీరి కలం పడే తపన ఎవరికీ  కనబడదు. అదే పాటా తెరపై హీరోయిజాన్ని పండిస్తోంది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. కానీ వీరి సృజనకు మాత్రం దక్కేది అరకొర మాత్రమే.  అవును తాజాగా .. కులశేఖర్ మరణంతో మరోసారి చిత్ర పరిశ్రమలో పాటల రచయత దుస్థితి గురించిన వార్త వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 26, 2024, 05:02 PM IST
Kulasekhar Lyricist: సినీ ఇండస్ట్రీలో పాటల రచయత దుస్థితి కారణం అదేనా  అంతేనా..

Kulasekhar Lyricist: ఒక సినిమా హిట్ అనిపించుకోవాలంటే అందులో నటించే నటీనటులు.. దర్శకులు, నిర్మాతలు, సంగీతం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభాలున్నాయి. ఇక మన భారతీయ సినిమాలంటే ముందుగా ప్రేక్షకులు కోరుకునేది పాటలు. అందులో అద్భుతమైన సాహిత్యం ఉంటే శ్రోతలు దాన్ని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. ఎంతో సృజనతో తమ మెదడును మధించి మరి పాటలు రాస్తుంటారు. కానీ నిర్మాతల నుంచి వారికీ దక్కేది మాత్రం ఏ పది వేలో.. ఇరవై వేలు మాత్రమే. అదే హీరోలు, హీరోయిన్స్  విషయానికొస్తే.. కోట్లలో పారితోషికాలు తీసుకుంటారు. ప్రస్తుత దర్శకులు కూడా అదే రేంజ్ లో వారికి తగ్గ పారితోషికాలు అందుతున్నాయి. మరోవైపు సినిమాకు ముఖ్యమైన సంగీత దర్శకుడికి కూడా మంచి రెమ్యునరేషన్ దక్కుతోంది.

కానీ ఓ సినిమాకు అద్భుత సాహిత్యం అందించే పాటల రచయతలకు మాత్రం తగిన గౌరవం దక్కడం లేదనే చెప్పాలి. వారి తగ్గ పారితోషికాలు అందడం లేదు. వచ్చినా మధ్యలో ఉండే మీడియేటర్స్ నొక్కడం ద్వారా వారికి రావాల్సిన పారితోషికాలు సరిగా అందడం లేదనే చెప్పాలి.  అందులో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగతా పాటలు రాసే రచయతలకు సినీ పరిశ్రమ నుంచి దక్కే పారితోషకం తక్కువే అని చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పటి సముద్రాల, దాశరథి వంటి ఎంతో మంది మహామహులైన కవులెవరు కూడా చివరి రోజుల్లో పెద్దగా కూటబెట్టింది ఏమి లేదనే చెప్పాలి. అటు వేటూరి గానీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి కానీ పెద్దగా ఆస్తులు కూడబెట్టిన దాఖలాలు లేవు. కులశేఖర్ లా మరి రోడ్డున పడలేదు కానీ.. సినీ పరిశ్రమలో వీరి సాహిత్యానికి విద్వత్తుకు  తగిన మూల్యం దక్కలేదనే చెప్పాలి.

మిగతా క్రాఫ్ట్స్ తో పోలిస్తే వీరికి దక్కేది తక్కువ. ఎంతో ఫేమున్నా..అందులో డైరెక్టర్స్ తో పాటు సంగీత దర్శకులతో  పరిచయాలు గట్రా ఉండాలి.  మంచి  మేనెజ్మెంట్ చేసే స్కిల్ ఉండాలి. వారందరితో నెగ్గుకు రావాలి. మరోవైపు సినీ ఇండస్ట్రీలో వచ్చిన సంపాదనను కూడా సక్రమ మార్గంలో పెట్టగలిగే నైపుణ్యం ఉండాలి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ అయినా.. మిగతా ఇండస్ట్రీలోనైనా క్రమశిక్షణతో పాటు అణకువగా ఉండటం వంటివి కూడా కీలక భూమిక పోషిస్తాయి. ఏది ఏమైనా  పాటల రచయత కులశేఖర్ మరణం అనేది సినీ ఇండస్ట్రీ అనేది ఓ బుడగ లాంటిదనే విషయాన్ని ప్రూవ్ చేసింది. ఇక్కడ నైపుణ్యంతో పాటు సమయస్పూర్తిగా నెగ్గుకురావడం వంటివి కీలక భూమిక పోషిస్తాయనేది ఎవరైనా గ్రహించాల్సిన విషయం.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News