Saif ali khan wife kareena Kapoor insta emotional post: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురయ్యాడు. బాంద్రాలోని ఆయన నివాసంలో ఆగంతకుడు ప్రవేశించి.. ఇష్టమోచ్చినట్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన కుమారుడు సైఫ్ ను ఆటోలో.. లీలావతి ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు.. సైఫ్ కు రెండు సర్జరీలు చేశారు. వెన్నుపాములో ఇరుక్కున్న కత్తి ముక్కను తొలగించాడు.
ఇప్పుడైతే.. సైఫ్ హెల్త్ సేఫ్ గా ఉందని చెప్పుకొవచ్చు. అయితే.. ఇటీవల సైఫ్ హెల్త్ పై అనేక మంది వివాదాస్పదంగా పోస్టులు పెడుతున్నారు. డాకు మహారాజ్ భామ ఊర్వశి రౌతేలా ఇంటర్వ్యూలో వివాదాస్పదంగా ప్రవర్తించారు. అంతే కాకుండా.. సీనియర్ నటుడు ఎంపీ శత్రుఘ్న సిన్హా సైతం.. ఈ ఘటనపై ఏఐ పోస్టులు చేయడం వార్తలలో నిలిచింది.
అంతే కాకుండా.. ఇక తాజాగా.. ఇన్ స్టాలో సైఫ్ ఇంటికి ఎవరో ఇద్దరు వెళ్లారని.. వారి పిల్లల కోసం బొమ్మలు తీసుకెళ్తున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై కరీనా కపూర్ తమను వదిలేయాలని.. ఏవో వీడియోలు క్రియేట్ చేసి తమను డిస్టర్బ్ చేయోద్దని సైఫ్ సతీమణి మండిపడ్డారు. మీకు పుణ్యం ఉంటుంది.. దయచేసి మమ్మల్ని వదిలేయండీ మేము బాధలో ఉన్నామని కూడా.. సైప్ భార్య ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Read more: Kumbh mela ki Monalisa: జాక్ పాట్ కొట్టేసిన మోనాలీసా..!.. బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్..?..
దీంతో ఇది కాస్త వార్తలలో నిలిచింది. మరోవైపు ముంబై పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కోర్టు ఐదురోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter