MAA Elections 2021: 'మా' ఎన్నికల తేదీ వచ్చేసింది..ఎప్పుడో తెలుసా?

MAA Elections 2021:మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 07:10 PM IST
  • మా ఎన్నికల తేదీ ఖరారు
  • అక్టోబరు 10న ఎన్నికల నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం వెల్లడి
  • ప్రచారానికి సిద్దమైన ప్యానెల్స్
MAA Elections 2021: 'మా' ఎన్నికల తేదీ వచ్చేసింది..ఎప్పుడో తెలుసా?

MAA Election Date: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల తేదీ(MAA Elections date) ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ‘మా’ క్రమశిక్షణ సంఘం ప్రకటించింది. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

 ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌(Prakash Raj), మంచు విష్ణు(Manch Vishnu), జీవిత, సీవీఎల్‌ నరసింహారావు, హేమ(Hema)లు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల ఆన్ లైన్ వేదికగా మా సర్వసభ్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల(MAA Elections) నిర్వహణ అంశంపై చర్చ జరిపారు. క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అదే చేస్తామని మా అధ్యక్షుడు నరేష్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

Alsio Read: MAA Elections 2021: వర్చువల్ గా 'మా' కార్యవర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!

అయితే ముందుగా సెప్టెంబర్ నెలలో మా ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. కానీ.. కరోనా(Corona) నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తు సన్నద్ధత అవసరమని.. అందుకు కాస్త సమయం కావాలని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. దీంతో సెప్టెంబర్ అక్టోబర్ రెండో వారలో ఎన్నికలు నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌(Naresh) వెల్లడించనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించారు. సీనియర్ నరేష్‌పై హేమ చేసిన కమెంట్స్ నుంచి వార్ మొదలైంది. ఆ తర్వాత హేమ(hema)పై నరేష్ సీరియస్ కావడం.. అక్కడ్నుంచి మరింత హై రేంజ్‌కు వెళ్లిపోయాయి గొడవలు. తారాస్థాయికి చేరడంతో మధ్యలో చిరంజీవి(Chiranjeevi) కూడా కలగజేసుకున్నాడు. క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాసాడు. ఈ విషయాలన్ని చర్చించడానికి ఇటీవలే ఆన్‌లైన్‌ వేదికగా ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News