Mumait Khan police complaint: నన్నే రాజు వేధిస్తున్నాడు: ముమైత్ ఖాన్

Actress Mumait Khan complaint against cab driver Raju : హైదరాబాద్: మూడు రోజుల గోవా టూర్ కోసం ముమైత్ తన క్యాబ్‌ను బుక్ చేసుకొని, ఆ టూర్ 5 రోజులకు పొడిగించిందని, కనీసం టోల్ ఫీజు, డ్రైవర్ అకామడేషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదని రాజు అనే క్యాబ్ డ్రైవర్ ముమైత్ ఖాన్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Oct 2, 2020, 03:55 AM IST
Mumait Khan police complaint: నన్నే రాజు వేధిస్తున్నాడు: ముమైత్ ఖాన్

Actress Mumait Khan complaint against cab driver Raju : హైదరాబాద్: మూడు రోజుల గోవా టూర్ కోసం ముమైత్ తన క్యాబ్‌ను బుక్ చేసుకొని, ఆ టూర్ 5 రోజులకు పొడిగించిందని, కనీసం టోల్ ఫీజు, డ్రైవర్ అకామడేషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదని రాజు అనే క్యాబ్ డ్రైవర్ ముమైత్ ఖాన్‌పై ( Actress Mumait Khan ) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత అయినా చెల్లిస్తుందని అనుకుంటే, ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా చెల్లించలేదని క్యాబ్ డ్రైవర్ రాజు మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు ముమైత్ ఖాన్‌ని మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయి. Also read : Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ? 

Mumait Khan files complaint: ఇదిలావుండగా తాజాగా రాజు ఆరోపణలపై స్పందించిన ముమైత్ ఖాన్.. క్యాబ్ డ్రైవర్ రాజు మాటల్లో వాస్తవం లేదని, అతడికి ఇచ్చే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదని వేధింపులకు గురిచేస్తున్నాడని ముమైత్ ఆరోపించింది. గురువారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ముమైత్ ఖాన్.. ఇదే విషయంలో రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also read : Bigg Boss 3 payment: బిగ్ బాస్ 3 పారితోషికం ఇంకా రాలేదంటున్న హీరోయిన్

డ్రైవర్ రాజు చేసిన ఆరోపణలు నిజం కావని, డ్రైవర్ రాజునే తనను బ్లాక్ మెయిల్ చేశాడని, రాష్ డ్రైవింగ్ చేసి తనని భయాందోళనకు గురి చేశాడని ముమైత్ తన ఫిర్యాదులో పేర్కొంది. క్యాబ్ డ్రైవర్‌కు 23 వేలు 500 రూపాయలు చెల్లించానని, ఈ విషయంలో తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఉన్నాయని మీడియాకు ( Mumait khan interview ) వెల్లడించింది. అలాగే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన క్యాబ్ డ్రైవర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరింది. Also read : Puri to direct Pawan Kalyan: పూరి జగన్నాథ్‌తో పవన్ సినిమా ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News