Netflix Movies List: వరుసగా ప్రాంతీయ చిత్రాల్ని విడుదల చేస్తే క్రేజ్ పెంచుకుంటున్న నెట్‌ఫ్లిక్స్ త్వరలో మరి కొన్ని కొత్త సినిమాలు విడుదల చేయనుంది. గత ఏడాది అంటే 2024లో సైతం బాక్సాఫీస్ హిట్ మూవీల్ని విడుదల చేసింది. ఇప్పుడు మరి కొన్ని సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒకేసారి కొత్త సినిమాల విడుదల హక్కుల్ని సొంతం చేసుకుంది. ఇంకా థియేటర్‌లోనే విడుదల కాని సినిమాలను సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తరువాతే ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ తేదీల్లో స్ట్రీమింగ్ అవుతాయి. అయితే ప్రేక్షకుల సమాచారం కోసం ముందే వివిధ సినిమాల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సినిమాల జాబితాలో పవన్ కళ్యాణ్ నుంచి నవీన్ పోలిశెట్టి వరకూ సినిమాలున్నాయి.
పవన్ కళ్యాణ్ - ప్రియాంక మోహన్ నటించిన ఓజీ, నాగచైతన్య- సాయి పల్లవి నటించిన తండేల్, రవితేజ-శ్రీలీల నటించిన మాస్ జాతర, నాని-శ్రీనిధి శెట్టి నటించిన హిట్ 3, విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే నటించిన వీడీ 12, సంగీత్ శోభన్- నార్నే నితిన్, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ-వైష్మవి చైతన్య నటించిన జాక్, ప్రియదర్శి, సాయి కుమార్ నటించిన కోర్ట్ సేట్ వర్సెస్ ఎ నోబడి, నవీన్ పోలిశెట్టి-మీనాక్షి చౌదరి నటించిన అనగనగా రాజు సినిమాలున్నాయి. ఈ సినిమాలు ఇంకా థియేటర్ విడుదల కాలేదు. ఎప్పుడనేది కూడా తెలియదు. అప్పుడే స్ట్రీమింగ్ ప్రకటన వచ్చేసింది.
Also read: Nag Mark 2 Missile: భారత సైనిక శక్తికి మరో ఆయుధం, చైనాకు సవాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.