Prabhas: డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడు, కారణమేంటి

Prabhas: బాహుబలి ప్రభంజనంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్..ఫుల్ బిజీగా ఉంటున్నాడు. చేతి నిండా సినిమాలతో ఉన్న ప్రభాస్..ఫ్యాన్స్‌కు నిరాశ కల్గించే విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 7, 2022, 10:28 AM IST
Prabhas: డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడు, కారణమేంటి

Prabhas: బాహుబలి ప్రభంజనంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్..ఫుల్ బిజీగా ఉంటున్నాడు. చేతి నిండా సినిమాలతో ఉన్న ప్రభాస్..ఫ్యాన్స్‌కు నిరాశ కల్గించే విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. చేతిలో 5-6 పాన్ ఇండియా సినిమాలుండటంతో బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టాడు. మార్చ్ 11న విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో ఉన్నాడు ప్రస్తుతం. పాన్ ఇండియా మార్కెట్ కాపాడుకునే దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయాలు కచ్చితంగా అభిమానుల్ని ఒకింత నిరాశకు గురి చేస్తున్నాయి.

ఇతర హీరోలతో పోలిస్తే ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. చాలా తక్కువ సమయం కేటాయిస్తాడు. అందుకే ఫ్యాన్స్ అతన్ని ఫాలో కాలేకపోతున్నారు. సినిమా విడుదలకు పది రోజుల ముందు నుంచే ప్రమోషన్‌లో పడ్డాడు. వేరే పనేమీ లేకుండా చిన్నా పెద్దా అన్ని మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సోషల్ మీడియకు పూర్తిగా దూరమైపోయాడు. ఇకపై అభిమానులు సోషల్ మీడియాలో మరింత దూరం కావల్సి వస్తుంది. స్వయంగా ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాకు మరింత తక్కువ సమయం కేటాయిస్తానంటూ ఆశ్చర్చపరిచాడు. సోషల్ మీడియాలో తక్కువ సమయం కేటాయిస్తున్నా..ఫాలోయింగ్ మాత్రం చాలానే ఉంది మన డార్లిగ్‌కి. కానీ సోషల్ మీడియా పెద్దగా వాడనంటున్నాడు. ఇది కచ్చితంగా అతని అభిమానులకు నిరాశ కల్గించే అంశమే. ఇక నుంచి సినిమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానంటున్నాడు. సినిమాల రూపంలోనే ప్రేక్షకులకు చేరువ కావాలనేది తన ఉద్దేశ్యమన్నాడు. ఇక నుంచి ప్రతి యేటా 2-3 సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నానంటున్నాడు.

సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు పెద్దగా రియాక్షన్ ఇవ్వకపోయినా..ఇంతగా తనను ప్రేమిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ మార్చ్ 11వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Also read: Sarkaru vaari paata: సర్కారువారిపాట విడుదల మళ్లీ వాయిదా, త్వరలో రెండవ సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News