Allu Arjun : సింపుల్‌గా రోడ్డుపై పుష్ప రాజ్.. ట్రోల్లింగ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!

Allu Arjun Pushpa 2: మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో కోల్డ్ వార్.. జరుగుతోంది అన్న రూమర్స్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చెక్కర్ల కొడుతూ ఉన్న.. విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి రోడ్డు మీద సింపుల్‌గా వెళ్తున్న అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్  ట్రోల్లింగ్ మొదలుపెట్టి ..వైరల్ చేస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 19, 2024, 05:06 PM IST
Allu Arjun : సింపుల్‌గా రోడ్డుపై పుష్ప రాజ్.. ట్రోల్లింగ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!

Allu Arjun Viral Video: పుష్ప భారీ సక్సెస్ తర్వాత.. ఐకాన్ స్టార్‌గా వరల్డ్ వైడ్ అల్లు అర్జున్‌కి.. పెరిగిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ ఒక్క మూవీతో బన్నీ లెవలే మారిపోయింది. అయితే అల్లు అర్జున్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా.. ఇప్పటికీ సింపుల్గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయం బన్నీ అభిమానులకు అందరికీ తెలిసిందే. అలా బన్నీ చాలా సింపుల్‌గా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మామూలుగా స్టార్ హీరోలు రోడ్డు మీద వెళ్తున్నారు అంటే చుట్టూ అభిమానులు ఊపిరాడనివ్వరు. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సాధారణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా హడావిడి లేకుండా రోడ్డు మీద సింపుల్‌గా వెళ్లలేరు. మరి అలాంటిది ఐకాన్ స్టార్ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా.. అలా సింపుల్‌గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వీడియో అందరిని ఆశ్చర్య పరుస్తోంది. వైరల్ అవుతున్న.. ఈ వీడియోలో బన్నీని చూసి కూడా ఎవరు దగ్గరికి వెళ్లకపోవడం గమనార్హం.

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇవ్వకుండా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళినప్పటి నుంచి  అల్లు ఫ్యామిలీ పై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కురిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఆ వీడియో లో ఏముందో తెలుసుకుందాం పదండి..

 

అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని రోడ్డుపై నడిచెళ్లిపోతున్నారు. అయితే మామూలుగా స్టార్ హీరో చుట్టూ బౌన్సర్లు, క్యారవాన్ ఉంటాయి.కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవు. అదే సమయంలో స్కూటీ మీద వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు పై వెళ్తున్న అల్లు అర్జున్‌ని చూసి ఆశ్చర్యంగా ఆగిపోయాడు.. కానీ దగ్గరకు రాలేదు. మళ్లీ కొంత దూరం వెళ్ళాక తిరిగి చూశాడు.. కానీ పలకరించకుండా వెళ్లిపోయాడు. మరొక పెద్దాయన బన్నీ ముందే నడిచి వెళ్ళాడు.. కానీ అటు వైపు ఓ చిన్న లుక్ కూడా వేయలేదు. ఈ వీడియోని షేర్ చేసిన మెగా అభిమానులు..బన్నీకి అసలు ఫాలోయింగ్ ఇదీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్‌కు ఆన్‌లైన్ లో తప్ప ఆఫ్‌లైన్‌లో క్రేజ్ లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

మరో పక్క దీనికి స్పందించిన.. అల్లు అభిమానులు ఈ రోజుల్లో ఇలా క్యారవాన్, బౌన్సర్లు లేకుండా సింపుల్గా ఉండే హీరో ఎక్కడా లేరు.. మా బన్నీ తప్ప అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6కి వాయిదా పడింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ 21న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరిలో బ్లాక్ బస్టర్ ఎవరు  కొడతారో అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.

Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News