Salaar Remunerations: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రభాస్ ఎంతగానో ఎదురు చూసిన బ్లాక్ బస్టర్ వచ్చేసింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి చాలా విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్న విషయం. మరి హీరో దగ్గర నుంచి విలన్ వరకు ఈ సినిమాలో చేసినందుకు ఒక్కొక్కడు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు చూద్దాం పదండి..
ప్రభాస్:
సలార్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే సలార్.. అనే విధంగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు ప్రభాస్. కాగా ఈ మూవీ కోసం ప్రభాస్ అక్షరాల 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక మూవీ లాభాలలో కూడా 10% వరకు వాటా హీరో ఖాతా కి వెళ్తుందట. ఈ మూవీ మొత్తం బడ్జెట్ 400 కోట్లు అని అంచనా.
ప్రశాంత్ నీల్:
తెర ముందు ప్రభాస్ సినిమాని నడిపిస్తే తెర వెనుక చిత్రాన్ని నడిపించిన వ్యక్తి ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గా ఇతను 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్:
ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో.. మూవీలో వరదరాజు మన్నారు పాత్రను పోషించిన పృథ్విరాజ్ సుకుమార్ ఈ చిత్రం కోసం నాలుగు కోట్ల రూపాయలు అందుకున్నారు.
శృతి హాసన్:
ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ 8 కోట్ల రూపాయలు పొందినట్లు తెలుస్తోంది.
జగపతి బాబు:
సలార్ మూవీలో మరొక ముఖ్యమైన పాత్ర రాజ్ మన్నారు.. ఈ పాత్రలో నటించిన జగపతిబాబు.. ఈ చిత్రానికి గాను రెమ్యూనరేషన్ కింద నాలుగు కోట్ల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ ఎక్కడో ఎవరికీ తెలియని ఒక ఖాన్సా నగరం.. దాని వారసత్వం చుట్టూ జరిగే పాలిటిక్స్.. పవర్ సాధించడం కోసం ఎత్తులు పై ఎత్తులు.. వీటన్నిటి మధ్య తన ఫ్రెండ్ కోసం ఒంటరిగా నిలబడే యోధుడు. కథ రొటీన్ గానే అనిపించిన.. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది అని అభినందిస్తున్నారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.
యాక్షన్ సన్నివేశాలతో.. అద్భుతమైన టేకింగ్ తో ముందుకు సాగే ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ భారీ యాక్షన్ మూవీ మొదటి రోజే ఇండియా వైడ్ 95 కోట్ల వరకు నికర వసూలు రాబట్టింది అని అంచనా. ఇక పోను పోను ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook