Prabhas to Shoot Non Stop For Upcoming 3 Months: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ప్రభాస్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒకరకంగా తనకు అన్ని విధాలుగా అండగా ఉండే కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ఒక పెద్ద అండను, ఒక పెద్ద శక్తిని కోల్పోయినట్లు అయింది. అయితే ప్రభాస్ ఇంత బాధలో కూడా షూటింగ్స్ కి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది.
ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. ప్రతి సినిమా మినిమం 200 కోట్ల బడ్జెట్ తోనే ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఆయన నటించిన ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేయాల్సి ఉంది. కృష్ణంరాజు మృతి చెందుతారన్న విషయం తెలియక, సినిమా యూనిట్ దాదాపుగా 12 సెట్లను ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో నిర్మించింది.
సెట్స్ నిర్మాణం పూర్తి కావడంతో రామోజీ ఫిలిం సిటీ స్థలానికి అలాగే సెట్ ప్రాపర్టీకి కూడా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సెట్ తీసేసి మళ్ళీ బిగించడం అంటే అది అదనపు ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ఎట్టి పరిస్థితులలో షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభాస్ కూడా నిర్మాతలు ఇబ్బంది అర్థం చేసుకుని సినిమా షూటింగ్ కి హాజరయ్యేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే మళ్ళీ ఆయన ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లో హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తవుగానే మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అంటే పెదనాన్న చనిపోయిన బాధ మరువకముందే ఆయన మూడు నెలల పాటు ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. ఒక రకంగా ఇది ప్రభాస్ కి కష్టకాలం అనే చెప్పాలి. కానీ తన వ్యక్తిగత లోటు కంటే ఎక్కువగా ధర్మానికే మొదటి ఓటు వేస్తున్న ప్రభాస్ అన్ని సినిమాల షూటింగ్లకు హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: The Ghost Pre release event: తండ్రి కోసం తరలి రానున్న తనయులు.. కర్నూల్ ఈవెంట్ కోసం స్పెషల్ ప్లాన్స్!
Also Read: Samantha Ruth Prabhu Second Marriage: రెండో పెళ్లికి సిద్దమైన సమంత.. ప్రూఫ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook