Priyamani - Bhamakalapam 2 Trailer Talk: జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భామా కలాపం 2'. ఫిబ్రవరి 16 నుంచి ఈ చిత్రం డైరెక్ట్‌గా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను విజయవాడలోని రెయిన్ ట్రీ పార్క్ కమ్యూనిటీలో విడుదల చేశారు. ఆ కమ్యూనిటీలో ఉండే మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎతో ఉత్సాహాంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమంలో గృహిణిలందరూ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్‌లతో చిట్ చాట్ చేసారు. ఇక ట్రైలర్‌ను చూస్తే... అనుపమ (ప్రియమణి) తన సొంత యూ ట్యూబ్ ఛానల్‌లో వంటల కార్యక్రమాన్ని నిర్వహించే ఓ మహిళ పాత్రలో నటించింది. ఆమె ఊహించని పరిస్థితుల్లో పెద్ద ప్రాబ్లెమ్‌లో ఇరుక్కుంటుంది. మరో వైపు నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ డ్రగ్స్‌ను పట్టుకోవటానికి ఏవో ప్రయత్నాలు చేస్తుంటుంది. అసలు డ్రగ్స్ మాఫియా ఎలాంటి పథకం వేసింది. దాన్ని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ ఎలా ఐడెంటీ ఫై చేసిందనేదనేది ఈ సినిమాలో చూపించారు. డ్రగ్స్ వ్యాపారులను ఆగడాలను అరికట్టడానికీ నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ ఏం చేసింది.. మరో వైపు అనుపమ (ప్రియమణి) ఎలాంటి ప్రాబ్లెమ్స్‌లో చిక్కుకుంది. ఆమెకు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన భామా కలాపం సినిమాలో సీరత్ కపూర్ పాత్రకు ఉన్న లింకేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ‘భామాకలాపం 2’ సినిమా చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, స్వప్న సుందరి అనే సాంగ్, ఇప్పుడు విడుదలైన ట్రైలర్.. ‘భామాకలాపం 2’ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ 'భామా కలాపం 2' మూవీని తెరకెక్కించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసారు. ఈ సినిమాకు అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. కొన్నాళ్లు ముందు విడుదలైన భామాకలాపం ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16న ఆహాలో అలరించనుంది. ఇందులో అనుపమ మోహన్ అనే యూట్యూబర్ పాత్రలో ప్రియమణి ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్.. ఈ కథ స్ఫూర్తిదాయకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook