Rakul Preet Singh Pet Death : రకుల్ ప్రీత్ ఇంట్లో విషాదం నెలకొంది. పదహారేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చిన పెట్ మరణించడంతో రకుల్ వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా కనిపిస్తోంది. తనకు తన పెట్ మీదున్న ప్రేమను కురిపిస్తూ వేసిన పోస్ట్ అందరినీ కదిలిసిస్తోంది. తన పెట్ బ్లాసమ్ చనిపోయిందని, గుండె పగిలినట్టుగా అయిపోయిందంటూ రకుల్ వేసిన పోస్ట్ అందరినీ ఏడిపించేస్తోంది. ఇంతకి రకుల్ వేసిన పోస్ట్‌లో ఏముందంటే?..
బ్లాసమ్.. మా జీవితాల్లోకి నువ్ పదహారేళ్ల క్రితం వచ్చావ్.. మా జీవితాల్లోకి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చావ్.. నిన్ను ఇకపై ఎంతగానో మిస్ అవుతుంటాం.. నువ్ ఎంతో చక్కని జీవితాన్ని గడిపావ్.. వెళ్లే ముందు కూడా ఎలాంటి బాధలు లేకుండా వెళ్లిపోయావ్.. నాకు ఎంతో సంతోషంగా ఉంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నువ్ ఎక్కడున్నా బాగుండాలి అంటూ రకుల్ వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెట్‌తో రకుల్‌కు ఉన్న బంధం తెలిసేలా పాత ఫోటోలన్నీ షేర్ చేసింది.
నిన్న గాక మొన్న రకుల్ తన లవర్ జాకీ భగ్నానీ బర్త్ డే అంటూ స్పెషల్ పోస్ట్ వేసింది. శాంటా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వే.. నా జీవితంలోకి ఆనందాన్ని, మనశ్శాంతిని తీసుకొచ్చావ్ అంటూ ఇలా తన ప్రియుడు మీద పోస్ట్ వేసింది. ఇంతలో ఇప్పుడు ఇలాంటి విషాదభరితమైన పోస్ట్ వేయాల్సి వచ్చింది.
రకుల్‌కు ఈ ఏడాది టాలీవుడ్లో అంతగా కలిసి రాలేదు. ఆమె చేసిన కొండపొలం సినిమా ఆకట్టుకోలేకపోయింది. రకుల్‌కు ఇప్పుడు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఆమె కూడా బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తమిళంలోనూ రకుల్ సినిమాలు చేస్తున్నట్టుగా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమెకు ఆఫర్లు రావడం లేనట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook