Ram Charan - Ananth Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లి వేడుకకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ గుజరాత్‌లోని జామ్ నగర్లో వాలిపోయారు. ఈ వేడుకకు సినీ, వ్యాపార, క్రికెట్ సహా పలు రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ఈవెంట్లో రామ్ చరణ్‌కు ఘోర అవమానం జరిగింది.
ఈ పెళ్లి వేదికపై బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ హీరోలు ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పలు వేసి అలరించారు. వీళ్లు హుషారుగా డాన్స్ చేస్తోన్న సందర్భంగా షారుఖ్.. రామ్ చరణ్‌ను వేదికపై రమ్మని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను ఉద్దేశించి 'ఇడ్లీ సాంబార్' పైకి రా అంటూ షారుఖ్ పిలవడం చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరణ్‌ను ఇడ్లీ సాంబార్ అంటూ షారుఖ్ పిలవడం నచ్చలేదని ఆమె పోస్ట్ చేసింది.
రామ్ చరణ్‌ను షారుఖ్ పిలిచిన విధానంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్.. రామ్ చరణ్‌తో ఉన్న చనువు కొద్ది అలా పిలిచానని ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని షారుఖ్ వివరణ ఇచ్చారు. మొత్తంగా షారుఖ్‌కు ఇక్కడ నటులంటే అంత చులకన భావమా.. ? అని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.