Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..

Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 22, 2024, 07:17 PM IST
Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..

Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో  అట్టహాసంగా జరిగింది.

ఈ ఈవెంట్ లో గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ దర్శకత్వం వహించిన ‘స్నేహితుడు’ మూవీకి అతిథిగా వెళ్లాను. ఆ సమయంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామనుకున్నాను. కానీ అడగలేకపోయాను. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్  అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ తో పని చేయడం నా అదృష్టం మన్నారు.  నా నుంచి సింగిల  ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ప్రేక్షకులను నిరాశా పరచదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్  మా కార్యక్రమానికి వచ్చి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.  దిల్ రాజుతో పని చేయడం హ్యాపీగా ఉందన్నారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ మాట్లాడుతూ..ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఓవర్సీస్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
అప్పట్లో  ‘వన్ నేనొక్కడినే’ మూవీని ఇక్కడి ప్రేక్షకులు ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావన్నారు. నిర్మాత దిల్ రాజు నాకు డైరెక్టర్ గా  ఫస్ట్ అవకాశం  ఇచ్చారు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవి ఎందుకు శంకర్ తో సినిమా చేయలేదు. శంకర్ తెలుగు సినిమా ఎందుకు  చేయడం లేదనే డౌట్ నాతో పాటు చాలా మంది అభిమానులకు ఉండేది.

కానీ శంకర్ తో రామ్ చరణ్ సినిమా అని తెలిసి ఎంతో సంతోషించాను ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పారు. సూర్య తీసిన ఖుషి నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశారు. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించించింది. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగుతూ వస్తోంది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. చిరంజీవి  కలిసే ఈ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ బాగుంది.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ రేంజ్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్.. జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలం సినిమాకు రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇక గేమ్ చేంజర్‌ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘డల్లాస్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్  గురించి రాజేష్‌తో మాట్లాడాం. అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా ప్రయాణం ప్రారంభం అయింది. శంకర్ , చంద్రబాబు చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ నిర్మించిన వైశాలి మూవీని తెలుగులో రిలీజ్ చేశాను. అలా శంకర్ గారితో జర్నీ చేస్తున్న మేం ఇలా గేమ్ చేంజర్‌ను నిర్మించాను.  

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.శంకర్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. సినిమా గురించి అంతా చెప్పేశారు. నేను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాను.  ఇక్కడకు రావాలా? వద్దా? అనుకున్నాను. కానీ మీ అందరి కోసం వచ్చాను. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో సినిమాలు  చేశాను. కానీ నేను ఒక్క తెలుగు చిత్రం చేయలేదు. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలనుకున్నాను. ఆ తర్వాత ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు కూడా జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అది  

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.తమన్ మాట్లాడుతూ.. ‘శంకర్ తో పని చేసే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. పైగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో నాకు ఛాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ..  ‘‘ఫస్ట్ టైమ్ ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డ‌ల్లాస్‌లో ఇంత గొప్పగా జరగడం ఆనందంగా ఉందన్నారు. గేమ్ చేంజర్ చిత్రంలో నేను చేసిన పాత్ర‌.. నా కెరీర్‌లో బెస్ట్ రోల్‌గా నిలిచిపోతుందని అనుకుంటున్నాను.  అంత మంచి రోల్‌ను నాకు రాసిన శంక‌ర్‌ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతునున్నాను. దిల్‌రాజుకి, శిరీష్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. ఎస్‌వీసీని నా ఫ్యామిలీ ప్రొడ‌క్ష‌న్‌గా భావిస్తుంటాను. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, వ‌కీల్ సాబ్ సినిమాలు చేశాను. ఇప్పుడు గేమ్ చేంజ‌ర్‌తో పలకరించబోతున్నాను. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌ను చాలా కొత్త‌గా చూడ‌బోతున్నారు ప్రేక్షకులు. అప్ప‌న్న క్యారెక్ట‌ర్‌ను అంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News