Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం... గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌ వాయిదా!

Ram Charan Movie: రామ్‌చ‌ర‌ణ్ నయా మూవీ గేమ్‌ఛేంజ‌ర్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దీనికి అసలు కారణం ఏంటంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 11:29 AM IST
Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం... గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌ వాయిదా!

Game Changer Shooting Post Poned: మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్-స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్‌ఛేంజ‌ర్'(Ram Charan). తాజాగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. సెప్టెంబ‌ర్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించింది. కొంత మంది యాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని.. అక్టోబరు రెండో వారం నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే షూటింగ్ ఆగిపోవడానికి అసలు కారణం అది కాదని తెలుస్తోంది. 

రెండు రోజుల కిందట జరిగిన ప్రమాదంలో రామ్‌చ‌ర‌ణ్ ముఖానికి దెబ్బతగిలిందట. గాయం(Ram Charan Injury) చిన్నదే అయినా పది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీని కారణంగానే ఈ కొత్త షెడ్యూల్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  గాయం నుంచి రామ్‌చ‌ర‌ణ్ పూర్తిగా కోలుకున్న త‌ర్వాత‌ ఆక్టోబ‌ర్ 6 నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారట. ఈ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే మెుదలు పెట్టబోతున్నారట. ప్రస్తుతం శంకర్ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. దీనికి  కేజీఎఫ్ ఫేమ్ అన్భు అరివు సారథ్యం వహించనున్నారు. 

పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న  ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య‌విధేయ‌రామ త‌ర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియ‌న్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల భారీ వ్యయంతో దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో  శ్రీకాంత్‌, సునీల్‌, అంజ‌లి, ఎస్‌జే సూర్య‌ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

Also Read: Dulquer Salmaan: దుల్కర్‌ కొత్త చిత్రం 'లక్కీ భాస్కర్'’.. గ్రాండ్‌గా లాంఛ్.. ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News