Rana Naidu Season2: రానా నాయుడు సీజన్ 2 పై బిగ్ అప్డేట్.. ఈ సారి పచ్చిబూతులతో రానున్న వెంకీ మామ..

Rana Naidu Season2: టాలీవుడ్ బాబాయి, అబ్బాయిలైన వెంకటేష్, రానా ఇద్దరు కలిసి చేసిన ‘రానా నాయుడు’ దగ్గుబాటి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అయితే.. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ చేసిన ఈ బూతు వెబ్ సిరీస్ ను ఓ వర్గం ప్రేక్షకులు తిట్టుకుంటూనే ఎంజాయ్ చేసారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 23, 2024, 03:58 PM IST
Rana Naidu Season2: రానా  నాయుడు సీజన్ 2 పై బిగ్ అప్డేట్.. ఈ సారి పచ్చిబూతులతో రానున్న వెంకీ మామ..

Rana Naidu Season2: ఈ మధ్యకాలంలో హీరోలు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ కోవలో వెంకటేష్, రానా ఇద్దరు కలిసి చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పెద్ద సంచలనే సృష్టించింది. అయితే.. మాములుగా వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులకు ఇది కొత్తగా అనిపించకపోయినా.. మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించిన తన స్థాయిని తగ్గించుకున్నాడనే చెప్పాలి. ఏదో చోటా మోటా హీరోలు ఇలాంటి వెబ్ సిరీస్ లు డబ్బులు కోసం చేసారంటే ఓ అర్ధం ఉంది. కానీ వెంకటేష్ లాంటి మంచి క్లాస్ ఇమేజ్ ఉన్న నటుడు ఈ వెబ్ సిరీస్ లో ఆయన అభిమానులు కూడా చూడలేకపోయారు.

ఆయన ఇమేజ్ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి.. ఇలాంటి వెబ్ సిరీస్ ను చేయడం ఓ క్రిటిక్ గా మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం అందరు చేస్తున్నట్టుగానే ఈ వెబ్ సిరీస్ లో తన యాక్టింగ్ మెప్పించాడు. ఏది ఏమైనా బూతు వెబ్ సిరీస్ అంటూనే అందరు ఈ సిరీస్ చూసినవాళ్లే ఎక్కువగా ఉన్నారు.

తాజాగా రానా నాయుడు సీజన్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇపుడీ వెబ్ సిరీస్  సీజన్ 2 ప్రారంభించినట్టు ఓ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానాలతో పాటు అర్జున్ రామ్ పాల్ కూడా ఈ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సీజన్ ఈ యేడాది చివర్లో ప్రారంభం కానుంది. వెంకటేష్ విషయానికొస్తే.. ఈ యేడాది ‘సైంధవ్’ మూవీతో పలకరించాడు. వెంకీ కెరీర్ లో 75వ సినిమా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆగష్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో వెంకటేష్.. ఇద్దరు పెళ్లాల మధ్య నలిగే భర్త పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News